రేపటి జాతీయ హిందీ దినోత్సవం పురస్కరించుకొని, కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు.
హిందీ ఉపాధ్యాయులు
బత్తుల వినీల, బోనెల కిరణ్ కుమార్ ల పర్యవేక్షణలో నేడు క్విజ్ పోటీలు జరిగాయి. పది సమూహాలందు వందమంది విద్యార్థులు ఈ క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. రూపొందించిన
వంద అంశాల ప్రశ్నావళితో ఉపాధ్యాయులు తూతిక సురేష్, గుంటు చంద్రంలు క్విజ్ మాస్టార్లుగా నిర్వాహక బాధ్యతలను చేపట్టారు.
ప్రథమ, ద్వితీయ స్థానాలను పదవతరగతి విద్యార్ధిణీ విద్యార్థులు దీప్షికాశ్రీ, రిషీతరుణ్ టీం లు గెలుపొందగా, విజేతలైన ఆ ఇరు సమూహాల ఇరవై మందికీ రేపటి దినమున నిర్వహించు జాతీయ హిందీ దినోత్సవ వేదికపై బహుమతులను అందజేస్తామని వినీల, కిరణ్ కుమార్ లు తెలిపారు.
రాష్ట్ర భాషా కా మహత్ అనే అంశంపై వ్యాసరచన, హిందీ భాష ఆవశ్యకత అనే అంశంపై వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించామని విజేతలకు రేపటి దినమున బహుమతులను అందజేస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి