ప్రభుత్వ పాఠశాల పిల్లల ఔదార్యం

 - 'తలసేమియా' వ్యాధితో బాధపడుతున్న బాలికకు పండ్లు అందజేత
===================================================
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు  'తలసేమియా' వ్యాధితో బాధపడుతున్న ఆరున్నరేళ్ల బాలికకు పండ్లు అందజేసి, తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన కోట మనస్విని గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు అందరూ కలిసి డబ్బులు జమ చేసుకున్నారు. ఆ డబ్బులతో పండ్లను కొనుగోలు చేశారు. ఆదివారం రోజున అమ్మాయి ఇంటికి వెళ్లి అరటి పండ్లు, సేపులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య సూచన మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, అలాంటి వారికి మనకు తోచిన సహాయం చేయాలని మా హెడ్మాస్టర్ సమ్మయ్య సార్ ఎపుడూ చెబుతుంటారని, మమ్మల్ని అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్నారని వారు తెలిపారు. సమ్మయ్య సార్ సూచన మేరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వారి వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, సామాజిక కార్యకర్త తూండ్ల అరుణకిరణ్ కుమార్, అనుముల రమేష్, బాలిక కుటుంబ సభ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు