యాక్ససే సక్సెస్!!!?;- సునీతాప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ఈదడం ఎలా నేర్చుకుంటామో
మాట్లాడడం ఎలా నేర్చుకుంటామో
నడవడం ఎలా నేర్చుకుంటామో
పక్షి ఎగరడం ఎలా నేర్చుకుంటుందో!!

ఇదంతా ఒక యంత్రాంగం ఒక వ్యవస్థ
ఒక టెక్నాలజీ ఒక జీవనశైలి!!!

ఇక్కడ ఉపాధ్యాయుడు ఉండడు!!!.
ఉపాయం ఉంటుంది
ఊహ ఉంటుంది
స్వీయ ప్రయత్నం ఉంటుంది
యాక్సెస్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది!!

ఇంతకుముందు
కళ్ళు చెవులు మెదడు
జ్ఞాపకశక్తి ఏకాగ్రత ఉపాధ్యాయుడివి.!!

ఆ ఉపాధ్యాయుడు బయట ఉండేవాడు
బ్లాక్ బోర్డు బయట ఉండేది.

ఇప్పుడు
ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు
విద్యార్థి మెదడు లోపలే ఉంటున్నాడు.!!!

యాక్సిస్ ఇప్పుడు సక్సెస్
టెక్నాలజీ థియరీ కాదు
నాలెడ్జ్ ఇప్పుడు డిజిటల్ అయింది.

ఇక్కడ ఉపాధ్యాయుడు.
ఉపాయము!!
ఇక్కడ ఉపాధ్యాయుడు
ఊహ!!
ఇక్కడ ఉపాధ్యాయుడు
స్వీయ ప్రయత్నం!!
ఇక్కడ ఉపాధ్యాయుడు
యాక్సెస్!!!

యాక్సేసే సక్సెస్ అని చెప్పేవాడే
ఉపాధ్యాయుడు!!!?

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని.
Sunita Pratap teacher palem.

కామెంట్‌లు