కనుక్కున్నా!;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 సుఖం
వ్యాకోచించిన చోట
ఏడ్పులు
ఉపసంహరించిన చోట
కష్టాలు
ఉఛ్ఛిష్టాలైన చోట
శబ్దాలు
మూటలువిప్పిన చోట
ఆలోచన
బీజస్వంతమైన చోట
మనసుమల్లెలు
మాటలతేనెజల్లులు కురిపించిన చోట
కాలం స్థంభించిపోతుందని
నా స్నేహితుల సన్నిధి అదే అని
ఇప్పుడే కనుక్కున్నా!
*********************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
బాగుంది సార్ 🥀🙏🥀 అభినందనలు 🥀🥀