న్యాయాలు -244
వాత ప్రదీప న్యాయము
*****
వాతః అంటే గాలి,ప్రదీపః అంటే దీపము.
గాలిలో దీపము అని అర్థం. దీనినే తెలుగులో "గాలిలో దీపం" అనే సామెతతో పోలుస్తారు.
అసలు దీపం ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. చీకటిని తొలగించి అందరికీ వెలుగును పంచుతుంది. అలా తన వెలుగును తరతమ భేదం లేకుండా పంచుతుంది.అలా పంచే దీపం వెలిగేందుకు గాలి ఎంతగా సహకారం అందిస్తుందో( గాలి లోని ఆక్సిజన్) అంతే స్థాయిలో దీపాన్ని అటూ ఇటూ కదుపుతూ వెలుగును సరిగా పంచకుండ చేయడమే కాకుండా దీపం పూర్తిగా ఆరిపోయేలా కూడా చేస్తుంది.
కాబట్టి దీపానికి గాలి తగలకుండా ఉండే ప్రదేశంలో పెట్టడం గానీ, దీపం ఆరిపోకుండా చుట్టూ చిమ్నీ లాంటిది అమర్చడం చేయాలి. అప్పుడే దీపం చక్కగా వెలుగుతుంది.
మరి దీపము వెలిగించి గాలిలో పెట్టి అంతా నీదే భారం' అని ఆ పైవాడికి వదిలేస్తుంటారు కొంతమంది. అలా చేస్తే దీపం మలగకుండా వుంటుందా? దేవునిపై భారం వేస్తే వెంటనే వచ్చి రక్షిస్తాడా?
దీపాన్ని వెలిగించినప్ఫుడు అది గాలికి మలిగిపోకుండా/ ఆరిపోకుండా కనీస మానవ యత్నం చేయాలి కదా! ఇలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా ఉండే వారి మనస్తత్వం ఎలాంటిదంటే సోమరితనంతో పెనవేసుకున్న మూర్ఖత్వం అన్నమాట.
ఈ విషయం అందరికీ తెలిసిందే కదా మరి ఈ న్యాయములో అంతరార్థం ఏదైనా ఉందా అని లోతుగా అధ్యయనం చేస్తే తప్పకుండా ఉందనే అర్థం అవుతుంది.
మన మనసు కూడా దీపం లాంటిది.జ్ఞానం కాంతి వంటిది. ఈ దీపం తన కాంతిని ఎలాంటి ఆటంకాలు లేకుండా నలుగురికీ పంచే సమయంలో గాలి వంటి ఆటంకాలు వస్తూ, పోతూ ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా వుంటూ తనను తాను కాపాడుకుంటేనే తనలోని జ్ఞాన కాంతులు నిరాటంకంగా వెదజల్లే అవకాశం ఉంటుంది.
అందుకే మనో దీపం నిశ్చలంగా ఉండాలంటే ఏం చేయాలో వేమన చెప్పిన పద్యాన్ని చూద్దామా...
"గాలిలేని దీపకళిక చందంబున/నలలు సుళ్లు లేని జలధి రీతి/నిశ్చలాత్మ యెన్న నిర్వికారంబున/ నుండెనేని ముక్తి యండ్రు వేమా!"
"గాలి తగలకుండా జాగ్రత్త పడితే దీపమెలా ఆరిపోకుండా చక్కగా, స్థిరముగా వెలుగుతుందో అదే విధంగా అలలు, సుడిగుండాలు లేని సముద్రము ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే మానవుడు కూడా ఉండాలంటే గాలి,అలలు ,సుడిగుండాల లాంటి కోరికలను అంటే భౌతిక, మానసిక కోరికలను దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడాలి. నిర్వికారంగా అంటే ఎలాంటి వికారాలకు లోను కాకుండా ఉన్నట్లయితే మోక్షం లభిస్తుందని అర్థం.
అలాంటి మోక్షం లభించిన వారు తమ మోక్ష ప్రాప్తికి సంబంధించిన కాంతిని లోకానికి పంచేందుకు పై విషయాలను గమనంలో పెట్టుకొని చరిస్తూ, మార్గదర్శకులుగా జీవితాన్ని చరితార్థం చేసుకుంటారు.
ఇదండీ "వాత ప్రదీప న్యాయము"లో ఇమిడిన నిగూఢమైన అర్థము. అలాంటి ప్రయత్నం మనమూ చేసి సఫలీకృతులమవుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి