1792 అక్టోబర్లో పుట్టారు ఇంగ్లాండ్ వాసి జన్మించిన స్థలం వార్న్ హమ్ తండ్రి సర్ తిమోతా షెల్లీ తల్లి ఎలిజిబెత్ ఫిల్ హాల్ ఇతనికి నలుగురి చెల్లెళ్ళు
ఒక తమ్ముడు ఇతడే పెద్ద కుమారుడు.
తల్లి అప్పచెల్లళ్ళతో సంతోషంగా గడిపాడు ఆరు సంవత్సరాలు కి పాఠశాలలో అతని జ్ఞాపకశక్తికి బహుమతులు పొందాడు
విద్యార్థి దశలో పాఠశాలలో వేధింపులు హింసాత్మక చర్యలతో ప్రతిస్పందించక తప్పలేదు అతనికి పీడ కలలు, బ్రాంతులు, మరియు నిద్రలో లేచి నడిచి వెళ్లడం వీటితో బాధపడ్డాడు జీవితంలో ఈ స్థితిగతులు సమయానుకూలంగా భాధించాయి.
ఈయన పరిశోధనాత్మక పుస్తకాలు ప్రణయ మరియు అతీంద్రియ కధల గురించి చదవడానికి దోహదకరకాలయ్యాయి
ఈయన కాలాన్ని అసహ్యించుకొని రచనలు చేయడంతో అతనిని మ్యాడ్ షెల్లీ అన్నారు ఇతనీ క్షుద్ర విద్య మీద ఆసక్తి కలిగింది ఆ తరువాత తత్వ శాస్త్రం పై ఆసక్తి పెంచుకున్నారు శాస్త్రీయ పండితులుగా అసాధారణ వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
రాడికల్, క్రైస్తవ మతవ్యతిరేకంగాఅభిప్రాయాలు వ్యక్తీకరించడమే కాక అభివృద్ధికి తోడ్పడ్డాడు నాస్తికత్వం మీద కరపత్రాలు ప్రచురించాడు సమాధానం చెప్పకపోయేసరికి బహిష్కరణకు గురి అయ్యాడు. తండ్రి తన మాట వినకపోయేసరికి కొడుకుతో బంధాలు తెంచుకుంటానని బెదిరించేసరికి తండ్రికి దూరమయ్యాడు.
ఆఖరికి తుఫానులో మునిగింది అతని పడవ ప్రాణాలు కోల్పోయాడు తర్వాత అతని శవం ఒడ్డుకు కొట్టుకు వస్తే గుర్తుపట్టి దహన క్రియలు చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి