గోగు మేఘన శివానికి కళా రత్న జాతీయ పురస్కారం;- వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి

 సహితస్య భావం  సర్వజన హితాన్ని అభిలసిస్తూ రాసేదే సాహిత్యం. సర్వేజనా సుఖినోభవంతు అన్నట్లు సకల జనుల క్షేమాన్ని, సకల  జీవరాశుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాసేదే కవిత్వం.
 ఈ దిశలో  యువకవయిత్రి  కుమారి గోగు మేఘన శివాని, ఇంజనీరింగ్ సాంకేతిక విద్యను ఇండియాలో పూర్తిచేసి, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ సాంకేతిక చదువు 
ను ఆస్ట్రేలియాలోని మెల్బార్న్ విశ్వవిద్యాలయంలో పూర్తిచేసుకుని మాతృదేశంపై మక్కువతో తిరిగి భారతావని పై కాలు పెట్టి, హైదరాబాదులోని బి.హెచ్.ఇ.ఎల్., రామచంద్రపురం లో గల తన సొంత గృహమైన భారతీ నగర్ లో నివాసమంటూ వివిధ సామాజిక , సంస్కృతిక అంశాలపై కవితలు, కథానికలు వివిధ తెలుగు దిన పత్రికలలో 
 వ్రాయడమే గాక భారతీయ నృత్యాలను సైతం వివిధ వేదికలపై ప్రదర్శిస్తుంది.
తెలుగు సాహితీ సేవా రంగంలో మేఘన చేస్తున్న సేవలను గుర్తించి, ఆదివారం అంటే 17 -9 -2023 రోజు నాడు తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ వారు తెలుగు వెలుగు విశిష్ట సాహితీ కళారత్న జాతీయ గౌరవ పురస్కారం హైదరాబాదులో , జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రంతో మేఘనను సన్మానించారు.
  ఈ విశిష్ట కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రావుల గిరిధర్ గారు, తెలుగు వెలుగు సాహితీ వేదిక వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ పోలో రాజకుమార్  దైవజ్ఞ శర్మ  తదితరులు పాల్గొని మేఘన ను అభినందించారు.
 ఇంత చిన్న వయసులో కళారత్న జాతీయ పురస్కారం రావడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని మేఘన  పేరెంట్స్ డాక్టర్ గోగు వెంకటేశ్వర్లు డాక్టర్ గోగు శారద వెంకటేష్  అక్క శ్రావణి విధూషి, భావ సుచిన్ సింహాలు ఆనందం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు