.గతులను మార్చేస్తూ;- పద్మావతి ‌పి-- హైదరాబాద్
నేలా నింగీ సాక్షిగా ప్రకృతిని విధ్వంసం చేసే గతితప్పిన 
మానవ మేథస్సులు
ప్రాణం పోసిన ప్రకృతినె కాలుష్యంతో మలమల మాడ్చేస్తూ
ఆధునిక నాగరికత పేరుతో 
తన మనుగడకే ముప్పును తెచ్చే అణుబాంబుల విస్ఫోటనాల
యుద్ధాలతో తమ నీడల జాడలనె 
మరిచిపోతున్నాయి పంచభూతాలు

హింసా ద్వేషాల పడగల నీడలు దిశదిశలా
నలు దిశలా నిర్భయంగా సంచరిస్తున్నాయి
నిరాశా నిస్సృహలు గుండెల్లో గూడు కట్టి
కణకణ మండే అగ్నికీలల్లో మాడి మసియైపోతున్నాయి

వేదనా రోదనలతో వెలుగుల నీడలు వీడి
మనిషి చీకట్లలో బతుకులు ఈడ్చేస్తున్నాడు 
పదవి వ్యామోహాల కుహరంలో కళ్ళున్నా
కనిపించని అమానుషత్వాల పాము పడగల
నీడల్లో బతకలేక జీవిస్తున్నాడు

గతమంతా పీడ కలగా మరిచి విజ్ఞానంతో
ప్రగతికి దారులు వేసిన వెలుగులు
ధనవ్యామోహంతో మానవతలె 
మసిబారుతున్నాయి నేడు

గూడే లేక తొంగుంటానికి నీడే లేక
బతుకులు గతులు తప్పుతున్నాయి
స్వార్ధం నీడలో ఆశయాల అడుగుల నీడలు
తడబడుతున్నాయి
సత్యం ధర్మం విలసిల్లాలంటూ విశ్వశాంతికి 
మహనీయులు వెలిగించిన దివ్వెలు కొడిగట్టిపోతున్నాయి

జాడలు లేని ఆసరా నీడలు అసహజ రీతిలో
ముడుచుకు పోతున్నాయి
మంచిని పెంచే వ్యక్తిత్వపు నీడల్లో
వివేక విజ్ఞతలతో జీవిస్తుంటే 
భువిలోనె స్వర్గం కనిపించదా!
జీవితమె స్వర రాగమై పాడదా!!
***************************

కామెంట్‌లు