తానా అంతర్జాతీయ కవిసమ్మేళనానికి ప్రత్యేక అతిధిగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కు ఆహ్వానం

 ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భముగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సెప్టెంబరు 9వ తేదీ అంతరాతీయ వేదికగా నిర్వహిస్తున్న తెలంగాణా భాషా దినోత్సవ అంతర్జాతీయ కవిసమ్మేళనానికి భాగ్యనగరానికి చెందిన కవి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రత్యేక అతిధిగా ఎన్నుకొని ఆహ్వానించారు. ఇంతటి గౌరవం లభించినందుకు శ్రీ ప్రసాద్ గారు ఆనందం వ్యక్తపరిచారు. శ్రీ ప్రసాద్ గారు తానా అధ్యక్శులు శ్రీ నిరంజన్ శృంగవరపు గారికి, సమన్వయకర్త శ్రీ శ్రీనివాస్ చిగురుమళ్ళ గారికి మరియు తెలుగువెలుగు కార్యదర్శి శ్రీ మోటురి నారాయణరావు  గారికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ప్రసాద్ గారి అభిమానులు సంతోషం వ్యక్తపరిచారు.
కామెంట్‌లు