తెలుగు దోహాలు - ఎం. వి. ఉమాదేవి

 43)
ఘర్షణ తోమది తిమిరమే,పుఠం పెట్టు చర్య ఇది!
బ్రతుకున "రాజీ" పడుటయే, గెలుపులోని మర్మమిది!
44)
ఇట్లా జరుగుననుకున్నా , అంటూ తప్పు చేయకు!
ఎట్లయి నా సత్యమదియే, బయలగు తెలిసియు చెడకు!
45)
కాలము విలువే తెలియనీ, మూర్ఖజనుల కేమిచట
జీవితమంతా శ్రమించే, ఆర్తి వున్న చాలంట !
46)
రాలిన పువ్వూ నందమే, రమ్యమైన త్యాగమది
దేవుని మెడలో మాలగా, ధరణి మీద నిల్చునది !
47)
అత్తరు జల్లుల మాటలే, ఆత్మబంధు కోటిగద
చిత్తము నిండుగ ప్రేమయే, సంతరించు శాంతిగద!!
48)
చేయకు జీవుల హింసనే, ఫలితమెంత హీనమగు!
లోకపు శ్రేణులు తిట్టునే, పాపపుణ్య ములతెరగు!!
49)
రచయిత కునుకే తీయడూ, క్రొత్తఊహ చొచ్చుకొన!
భావన సిరులని వదలడూ, అక్షరముల మార్చుకొన!
50)
ఎముకలు కొరికే మంచులో, ఎంతదేశ భక్తిఅది
సైనిక దళముల ఘనతనే,చాటిచెప్పు మాట అది!
51)
 వరదల కారణ మేమిటో, నదుల గర్భమున ఇల్లు
నీతులు చెప్పే నేతలే,  ప్రజలజేబులకు చిల్లు!
52)
రచయిత ప్రాణము కలములో, అక్షరముగ దాగుంది!
భావన విడిచిన క్షణములో, జీవమువిడి పోతుంది!!
కామెంట్‌లు