రాముని సభ లో న్యాయానికై ఒక శునకం;- కొప్పరపు తాయారు

 ఒకరోజు రాముడు సభలో కూర్చుని ఉండగా ఎవరు న్యాయానికి రాకపోయేసరికి న్యాయం కోసం ధర్మం కోసం ఎవరూ రాలేదు కారణమేమీ అని అడిగాడు లక్ష్మణుని. దానికి లక్ష్మణుడు ఎవరు ధర్మంతో పరిపాలన చేస్తారు అటువంటి ఈ పాలనలో ఎవరు రారు రావలసిన అవసరం లేదు అన్నాడు 
               పోనీ ముఖ ద్వారం దగ్గర ఎవరైనా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారేమో చూసి రా అన్నారు. రాముడు మాట విని లక్ష్మణుడు రాజ ద్వారం దగ్గరికి వెళ్లి చూస్తే గాయపడ్డ శునకం  
కనిపించింది   ఓ శునకమా! నీకేమి ఆపద చెప్పు అని అంటే నేను ధర్మాత్ముడు అయినటువంటి రాముని వద్దకే పోయి చెప్పుకుంటాను నాకు అవకాశం కల్పించు అని వేడుకుంది.
           అంతే రాముడు దగ్గరికి తీసుకొని దాని బాధ చెప్పారు అప్పుడు రాముడు  ఓ శునక రాజమా? ఏమి నీ బాధ తెలుపుమా అన్నారు
          అనగానే ధర్మాన్ని రక్షించే భారము రాజు మీదే ఉంటుందని విన్నవించుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది ధర్మాన్ని తప్పినటువంటి  సర్వదసిద్ధుడు అనే వ్యక్తి పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు. అని విన్నవించుకుంది అప్పుడు రాముడు సర్వదసిద్ధుడిని పిలిపించి ఎందుకిలా చేసావ్ అని అడగ్గా అతడు యాత్రకి బయలుదేరే సమయంలో ఆకలితో ఉన్న నాకు  అడ్డు పడినందుకు కోపం వచ్చి నేను గాయపరిచే ను తపునాదే అని ఒప్పుకున్నాడు.
          రాముడు ఏమి శిక్ష అని ఆలోచిస్తూ ఉండగా ఈ శునకము మీరేమీ అనుకోనంటే నాది ఒక వినతి అంగీకరించండి అంది 
     వెంటనే రాముడు  నీ ఇష్ట ప్రకారమే చెప్పు అన్నారు అప్పుడు శునకం రామ ఇతనిని కలంజర అనే గ్రామానికి పంపి అక్కడ మఠాధిపతిగా నియమించండి అని ప్రార్థించింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాముడు వెంటనే నీకు జరిగిన గాయానికి అతనికి ఇదా శిక్ష అన్నారు.
    అవును రామచంద్ర ప్రభు ఇంత చిన్న కోపాన్ని తట్టుకోలేనివాడు అతడు
   గత జన్మలో మఠాధిపతిగా అక్కడ నేనే అందరినీ ఆదరిస్తూ కావాల్సినవన్నీ చేస్తూ చిన్న తప్పు కూడా చేయని నేను ఈ జన్మలో కుక్కగా జన్మించాను
 ఇంత చిన్న తప్పు భరించలేను ఈ బ్రాహ్మణుడు ఆ మఠాధిపత్యం ఎలాగా సజావుగా నడపగలడు అని ఆలోచించి ఎటువంటి శిక్ష పొందుతాడో అని ముందు చూపుతో నేను ఈ మఠాధిపత్యం ఇమ్మని కోరేను.....
కామెంట్‌లు