ఆంజనేయుడు;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
సీసమాలిక//
----------------

బాలాంజనేయుండు భగముపై నుఱుకుచు 
భానుని పట్టంగ 'భళి!'యటంచు 
సర్వదేవతలప్డు సాగిల పడుచుండి
మ్రొక్కినారట తాము మురిసి మురిసి /
 వైదేహి కోసమై వారాశి లంఘించి
లంకలో గాలించె రాత్రివేళ /
జానకీసతిఁ గాంచి సాంత్వన చేకూర్చి
ముద్రిక నొసగెనీ పుణ్యవరుడు /
ధర్మసూత్రంబులఁ దానవరాజుకు
బోధ జేయుచు చెప్పె బుద్ధినతడు /
లంకను గాల్చుచు రాక్షసమూకను
చీల్చి చెండాడెనీ సింహబలుడు /
లక్ష్మణున్ గాపాడ రయమున వెడలితాన్ 
సంజీవినిని దెచ్చె శక్తియుతుడు /
శ్రీరామచంద్రుని సేవకుడైనిల్చె 
పరమ భక్తుండగు భావి బ్రహ్మ.//

తేటగీతి //

పిలిచి కొల్చిన చాలును భీతిమాన్పు
రామదాసుడీ జగతిని రక్ష సేయు
శరణు వేడిన వారిని సాకుచుండు
వాయుపుత్రున కిత్తునే వందనంబు.//


కామెంట్‌లు