నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 శ్రీకృష్ణ జన్మస్థానం.
==============
                ఎవరైనా తప్పుడు పనులు చేసినా,  చట్ట  వ్యతిరేకంగా వ్యవహరించినా, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా "నీకు శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పదు" అని అంటూ ఉంటారు.  చెరశాలకు పర్యాయ పదంగా *శ్రీకృష్ణ జన్మ స్థానం* నానుడిని వాడతారు.  ఇది కూడా పురాణ కథ నుండి వచ్చింది. ఆ కథ ఏమిటో చూద్దాం
        "వసుదేవుడు గాడిద కాళ్ళు పెట్టుకున్నట్టు" నానుడు రావడానికి చెప్పిన కథే,  శ్రీకృష్ణ జన్మస్థానం నానుడుకి సరిపోతుంది. దేవకి వసుదేవుడు కు పుట్టిన అష్టమ సంతానం శ్రీకృష్ణుడు. తల్లిదండ్రులను కంసుడు చెరసాలలో ఉంచినప్పుడు శ్రీకృష్ణుడు పుట్టాడు. అంటే  శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టాడు. తప్పుడు పనులు  చేసేవారినే కదా చెరసాలలో  ఉంచేది.(దేవకి వసుదేవుడు తప్పు పనులు చేయకపోయినా కంసుడి దుష్ట బుద్ధి కారణంగా ఖైదులో ఉంచబడ్డారు.)  అందుకే తప్పుడు పనులు చేసేవారికి ఆవాసం చెరసాల. శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశం కారాగారం కాబట్టి , ఈ *శ్రీకృష్ణ జన్మస్థానం*  నానుడి  వాడుకలోకి వచ్చింది. 
కామెంట్‌లు