ఈ అంశంపై భగవాన్ శ్రీ రమణమహర్షి తమ బొధలలో అద్భుతంగా విసదీకరించారు. భగవన్నామము’, ‘ఆత్మ’ ఒకటేనని చెప్పేవారు భగవాన్ రమణ మహర్షి. మొదట్లో భగవంతుని నామజపం ధ్యానానికి ఏకాగ్రతకు ఉపకరిస్తుంది. సాధకులు పవిత్ర హృదయంతో, నిశ్చల మనస్సుతో, సర్వశ్య శరణాగతి భావంతో భగవంతును నామంపై నమ్మకముంచితే ఆ భగవన్నామం మనసు విడువకుండా మనతో ఉంటుంది. భగవన్నామజపం మనలో నిరంతరం కొనసాగుతుంటే ఇతర విషయములపైకి మనసు పరిగెత్తకుండా, నిశ్చలవౌతుంది. అప్పుడు మనిషి తన నిజస్థితి (ఆత్మతత్వం)లో ఉంటాడు. ప్రయత్న పూర్వకంగా ధ్యాన జపాదులచేత మనస్సు ఇతర విషయాలపైకి మరలక నిశ్చలమై నిలిచినచో ఇక మిగతాది స్వస్వరూపమే! అంటారు శ్రీ రమణమహర్షి.చిత్తవృత్తులను నిరోధించినపుడు పురుషుడు స్వస్వరూపం పొందుతాడు. స్వచ్ఛస్ఫటికం వద్ద ఏ రంగు పువ్వును ఉంచితే స్ఫటికంలో ఆ రంగు ప్రతిఫలించి స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది. పువ్వును తొలగించినపుడు స్ఫతికం తిరిగి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్త వృత్తులు పురుషునిలో ప్రతిఫలించడంవల్ల ఆ చిత్తవృత్తులే తానని పురుషుడు ఆయా వికారాలకు లోనవుతాడు. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు అని పతంజలి యోగసూత్రాలలో స్వస్వరూప దర్శనం గురించి వివరించారు.దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఆత్మదర్శనం లేదా స్వస్వరూప దర్శనం అంటారు. పరబ్రహ్మ సాక్షాత్కారం లేదా ఆత్మసాక్షాత్కారం పొందడమే నిజమైన పరమానందం.
సర్వ వేద సారం సమస్త తత్వ శాస్త్రాల సారాంశం, “నేనే భగవంతుడను” అనే అనుభూతిని పొందడం. నామ, రూప, గుణ రహిత సచ్చిదానంద పరబ్రహ్మమే ప్రతీజీవి సత్య స్వరూపం అంటారు.
సర్వ వేద సారం సమస్త తత్వ శాస్త్రాల సారాంశం, “నేనే భగవంతుడను” అనే అనుభూతిని పొందడం. నామ, రూప, గుణ రహిత సచ్చిదానంద పరబ్రహ్మమే ప్రతీజీవి సత్య స్వరూపం అంటారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి