రక్తం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రక్తం
ప్రాణాలను కాపాడుతుంది

రక్తం
సంబంధాలను కోరుతుంది

రక్తం 
శరీరానికి శక్తినిస్తుంది

రక్తం
అంగాలను పనిజేయిస్తుంది

రక్తం
గుండెను ఆడిస్తుంది

రక్తం 
ఆనందమొస్తే పొంగుతుంది

రక్తం
పిలిస్తే పలుకుతుంది

రక్తం
కోపమొస్తే మరుగుతుంది

రక్తం
గాయపడితే చిందుతుంది

రక్తం
ఆరోగ్యాన్ని సూచిస్తుంది

రక్తం
తగ్గితే శరీరవర్ణంమారుతుంది

రక్తం 
చెడితే రోగాలనుకలిగిస్తుంది

రక్తం
త్రాగితే రాక్షతత్వంవరిస్తుంది 

రక్తం
పంచితే సోదరభావంజనిస్తుంది

రక్తం
ఘనీభవిస్తే దేహంశవమవుతుంది

రక్తం 
దానంజేస్తే పుణ్యాన్నిస్తుంది

రక్తం
చిందితే రణరంగానికిదారితీస్తుంది

రక్తం 
వినగలిగితే మాట్లాదుతుంది

రక్తం
తెలుగురక్తం మనలోపారుతుంది

రక్తం
తెలుగురక్తం మనపైకవితలనుకుమ్మరిస్తుంది 


కామెంట్‌లు