సుప్రభాత కవిత ; - బృంద
బడలిక తీర్చిన రాతిరికి
కదలిక తెచ్చిన వేకువ

చీకటి నిండిన నింగికి
తలుపులు తీసిన తూరుపు

కొండల నడుమ వెలుగు
మింటికి బంగరు తొడుగు

గగనసీమ పడుతున్న
కనకమయమైన గొడుగు

నిదురించిన  కాసారాన్ని
నింపేసిన  కాంచన వర్ణం

మైమరపించే మనోరంజక
సుందర సురుచిర దృశ్యం

భువినేలే దినరాజుకు
ఇలపలికే స్వాగతం

పలుకరించు ప్రభాకరునికై
నిలిచి చూచు ప్రపంచం

సాంత్వన నిచ్చే కబురుతెచ్చే
కరుణాంతరంగునికై  వేచి ఉన్న 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు