కోలాటం (బాల గేయం)- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అక్కలందరు వచ్చారు
లక్క కోలలు తెచ్చారు
లిక్కిని వారు పిలిచారు
చక్కగా కోలలు వేశారు!

వారల్లి బిల్లి ఆడుతూ
తిరుగు కోలలు వేశారు
జల్లెడలా తిరుగుతూ
జడ కోలాటమేసారు!

రామ నామం పలుకుతూ
గుమ్మన కోలలు వేశారు
కృష్ణ నామం పలుకుతూ
కృపతో కోలలు వేశారు!

జాజిరి జాజిరి అనుకుంటూ
భుజం భుజం కలుపుతూ
ముద్దుగా కోలాట మాడారు
అందరి మన్నన పొందారు!


కామెంట్‌లు