బతుకమ్మ- పద్మావతి పిహైదరాబాద్6302093356
అమ్మను ఆదిశక్తిగా
థీశక్తికి పరాశక్తిగా
అంబగా దుర్గమ్మగా
అభయం నొసగే దేవేరిగా..

దుష్టుల దునుమాడుటకై
శిష్టుల రక్షించుటకై
శక్తిగా మహాశక్తిగా
ఇల వెలిసిన చండివి నీవే..

అమ్మగా ఆకలితీర్చే
అన్నపూర్ణగా
కోరికలు తీర్చేకల్పవల్లిగా 
మనసే మందిరంగా
ఆరాధిస్తూ..

బంతీ చేమంతులతొ
తంగెడు పూలతో
మల్లెల మాలలతో
పూలతో పూజిస్తూ

అంబర సంబరం
ఆటల పాటల వేడుకగా
కోలాటాలాడుతూ
ఇంటింటా మురిసే సంబరం
బతుకును నేర్పే బతుకమ్మను
నవరాత్రులు దేవీ స్మరణతో
మనసే అర్పిస్తూ 
అంబర సంబరం..
°°°°°°°°°°°°°°°°°°°°°

కామెంట్‌లు