అమ్మ భాష;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ భూమి మీద ఏ తల్లి అయినా బిడ్డకు పూర్తి  పూర్తి స్వేచ్ఛనిస్తూ  ఎంతో గారాబంగా పెంచుతుంది.  వాడు ఏది అడిగితే దానిని మరుక్షణంలో  ఇవ్వడంతో  వాడికి మరీ  చొరవ పెరుగుతుంది  మా గణేష్  9వ తరగతి చదువుతున్నాడు  ఉన్నట్టుండి ఒకరోజు  మమ్మీ నేను చదివిన పుస్తకాలు నువ్వు చదవగలవా  అని ప్రశ్నించాడు  నాకు పర భాష మీద  అంత ఆసక్తి లేదు  అందుకే  నేర్చుకోలేదు  అనగానే నేనంటే ఏమనుకున్నావు అని ఒక చిన్న పోజ్ ఇచ్చాడు గర్వంగా  మీ అమ్మమ్మ నాకు  అమ్మ అన్న శబ్దాన్ని నేర్పింది  నేను దానిని  వంట పట్టించుకున్నాను  నీకు ఎన్నిసార్లు చెప్పినా  అమ్మను మమ్మీగా చేసే స్థితి  మారలేదు  అమ్మంటే అర్థం తెలిసి  ఆ పవిత్ర రేణుకా దేవి  స్వరూపాన్ని  మమ్మీ గా  అంటే కుళ్ళిపోయిన శవంగా మార్చటం  నావల్ల కాదమ్మా  అంటే వాడికి దాని అర్థం కూడా తెలియజేయలేదు. చక్కటి నాన్న అన్న శబ్దాన్ని  డాడీగా చేస్తూ  సోదరులను బ్రోలుగా మార్చి  పిలవటం నాకు చేతకాదు నిజానికి వాటి అర్థాలు కూడా తెలియవు  మన ప్రక్కింటి ఆవిడ వచ్చి ఆంటీ అని నన్ను పిలుస్తుంది  ఆ శబ్దానికి అర్థం నాకు తెలియదు  పిన్ని అని గాని పెద్దమ్మ అని కానీ  అత్తయ్య అని గాని అన్నిటికీ ఒకే శబ్దం వాడడం  నా భాషలో లేదు  ప్రతి దానికి ప్రత్యేకమైన పేరు ఉంది  దానిని సక్రమంగా ఉపయోగించుకుంటూ  సన్నిహిత సంబంధాలను  పెంచుకుంటూ పోతున్నాం  ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు  హలో సార్  అంటూ ఒక చెయ్యి పైకెత్తి  ఊపుతూ మాట్లాడడం  నాకు తెలియదు  పంచాంద్రియాలు, జ్ఞానేంద్రయాలు కలిపి  10 వేళ్ళను  ఒక చోట చేర్చి హృదయ పూర్వకంగా తలవంచి నమస్కరించడం  తప్ప మరొకటి తెలియదు
ఏ చిన్న రుగ్మత శరీరానికి వచ్చినా  మందుల కొట్టుకు పరిగెత్తడం  దానికి సంబంధించిన మందులు తేవడం మాకు తెలియదు  మా అమ్మ చెప్పిన పోపుల డబ్బాలో ఉన్న ప్రతి వస్తువు దేనికి పనికి వస్తుందో  చిన్నతనంలోనే నూరి పోసింది  తలనొప్పిగా ఉంటే శొంఠిని అరగదీసి  దాని  రసాన్ని  కణితలకు రాస్తే  పది పదిహేను నిమిషాల్లో ఆ నొప్పి తగ్గిపోతుంది అని మా అమ్మ చెప్పింది  విరోచనం కాకపోతే  వాము ఉప్పు కలిపి  నమిలి మింగితే  గంటసేపట్లో  పని అయిపోతుంది అని మా అమ్మే చెప్పింది  ఏదైనా పని చేసేటప్పుడు కత్తిపేట తగిలి రక్తం వస్తే  ప్రక్కనే ఉన్న పసుపు తీసి వాడేది  క్షణంలో రక్తం  కారణం ఆగేది  నీలాగా మెడికల్ షాప్ కు వెళ్లి  సూది మందులు తెచ్చుకోవడం బిల్లలు వాడడం మాకు తెలియదు అంటూ అమ్మ చెప్పిన ప్రతి విషయాన్ని  ప్రతిమలాగా నిలబడి విన్నాడే తప్ప  ఆచరణ మాత్రం  శూన్యం  అదీ ఈనాటి యువత పరిస్థితి.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం