సహజ పండితుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సహజ పండితుడు గనక పోతనామాత్యుడు  కావ్యాన్ని ప్రారంభించడానికి ముందు  పరమ శివునికి బ్రహ్మకు తదితర దేవగణాలకు మ్రొక్కులు చెల్లించినారు  ఆ తర్వాత గణపతిని చదువుల తల్లిని వేనోళ్ళ ప్రస్తుతించారు  దుర్గామాతకు లక్ష్మీదేవికి ప్రణమిల్లారు  నేను వాల్మీకి మహర్షి అంతటి వాడిని కాదు వేదవ్యాసుని అంతటి వానిని కానే కాదు  ఏ విధంగా ఆలోచించినా కాళిదాసు మహాకవి తో నేను పోల్చ తగిన వాడిని కాదు  ఈ భాగవత రచనలో నన్ను ఎలా కృతజ్ఞుణ్ణి చేస్తావో ఏమో  ఈ పారమంతా నీదే తల్లి  అని భారతీదేవిని  సాక్షాత్తు  చదువుల తల్లి  అక్షరానికి మాటకు మూలం  వాణి మాతకు  నమస్కరించి  పూజించిన మహా వ్యక్తి  బమ్మెర పోతన గారు.
ఆంధ్ర భాష ఈ ప్రపంచంలో ఉన్నంతవరకు నిలిచిపోయే  పోతన రచించిన భాగవతం  దానిని గురించి మహాత్ముడు పోతన చెప్పిన విషయం  ఇది నేను రాసినట్టు కాదు  ఆ శ్రీరామచంద్రమూర్తి  ఆవహించి నాతో ఈ పని చేయించినాడు  దీనిని రచించడం బాధలన్నీ కూడా తొలగిపోతాయి కనక  ఇది వారికే  అంకితం  అనువదించడంలో కొందరు సంస్కృత పద సంపదకు పరవశిస్తారు  మరి కొందరు తెలుగు తియ్యందనానికి మురిసిపోతారు  మరి కొందరు ఉపయభాషల సారస్యాలకు ఉవ్విళ్లు ఊరుతూ ఉంటారు  దైవానుగ్రహంతో నేను సందర్భానుసారంగా  అందరినీ మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను  అని ఎంతో నమ్రతతో ఎంతో ఆయన చెప్పిన పలుకులు  ప్రతి ఒక్కరికి శిరోధార్యమే.భాగవతాన్ని కల్పతరువుగా చెప్పారు పోతన  కల్పతరువు యొక్క కొమ్మలు మృదువుగా ఉండి లోపల  ఈ చెట్టుపై గల చిలుకల యొక్క కల కళ రవములను ఎంతో మనోహరంగ వర్ణించి అలవి కానీ అందచందాలు  వన్నె చిన్నెలు పువ్వుల శోభలు కనువిందు చేస్తాయి  ఇది వృత్తాకారమైన ఉజ్జలమైన కాంతులతో శోభిల్లుతూ ఉంటుంది దీని ఫలాలు అమృత రసాలు చెప్పిన చేస్తూ ఉంటాయి  దీని పాదు విశాలమైనది ఈ కల్పతరువు వివిధములైన సమస్త పక్షులకు నిలయమై వాటికి హాయిని చేకూరుస్తాయి  అలాగే  ఈ అనువాదంలో వ్యాస మహర్షి చెప్పిన  విషయాలలో కొన్నిటిని తగ్గించి మరికొన్నిటిని పెంచి తన సహజ పాండిత్యాన్ని  తెలియచేస్తూ ఆంధ్రభాషకి అద్భుతమైన  శాశ్వతమైన భాగవతాన్ని అందించిన వాడు  బమ్మెర పోతనామాత్యుడు  ఈ భూమి మీద ఆంధ్ర భాష బ్రతికున్నంత వరకు ఈ గ్రంథం నిలిచి ఉంటుంది  అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు.


కామెంట్‌లు