చార్లీ చాప్లిన్;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961.
 ప్రపంచ సినీ చరిత్రలో  హాస్యానికి పెద్ద పీట వేసి  ప్రపంచ మన్ననలను పొంది మన్ననలను పొంది  అందరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిన వాడు చార్లీ చాప్లిన్  ఏ వేషా నికైనా ప్రక్కవేషా లు ఇంత అందంగా చేస్తే అంత గొప్ప పేరు వస్తుంది  చాప్లిన్ ఎంత ప్రఖ్యాతి పొందడానికి కారణం  లోరల్  హార్డీ  ఎంత లావుగా ఉంటాదో చెప్పలేము చార్లీ చాప్లిన్ అంత సన్నగా ఉంటారు వారిద్దరూ తెరమీద కనిపించగానే ప్రేక్షకులు కరతాళ  ధ్వనులతో ఆహ్వానం పలుకుతారు  వారు తెరపై కనిపించగానే హాల్ లో ఉన్న ప్రేక్షకుల నవ్వులతో  సినిమా హాలు ఎంతో అందంగా కనిపిస్తుంది వారి ఆకారాలు కానీ దుస్తులు కానీ వారి నడకలు కానీ  ప్రేక్షకులను అలరిస్తాయి మొదట్లో మూకీ చిత్రాల లో ప్రారంభించిన వారి జీవితం  అనేక సినిమాలలో వారి మాటలు వినే అవకాశం కూడా దొరికింది. వారి  చిలిపి చేష్టలతో వారు సృష్టించే హాస్యం అంత ఇంతా కాదు  ప్రపంచంలో రాజకపూర్ లాంటి  నట దిగ్గజం  కూడా చాలా సందర్భాలలో చాప్లిన్ ని అనుసరించడం మనం చూస్తాం. చార్లీ చాప్లిన్ ఎండక చేసుకున్న నటులను కూడా మనం గమనించినట్లయితే  వీరికి దీటుగా  చేయగలిగిన వారే అని అర్థమవుతుంది  ప్రతిపాత్ర ఎన్నికలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది  నటుడు అన్న వాడికి నవరసాలు పోషించగలిగిన సత్తా ఉండాలి అని మన పెద్దలు చెబుతారు  ఒక హాస్యం చేస్తే  జీవితంలో హాస్యనటుడు గానే మిగిలిపోతాడు  రేలంగి వెంకట రామయ్య గారి లాగా  పాత్రోచితంగా ఆ పాత్రలో ప్రవేశించి  అన్ని రసాలను పోషించగలిగిన వాడు మాత్రమే  గొప్ప నటునిగా పేరు పొందుతారు మూగ సినిమాల  అంకం పూర్తయిన తర్వాత  టాకీ చిత్రాలు  ప్రారంభమైన తర్వాత వారి మాటలు కూడా వినే అవకాశం ప్రేక్షకులకు దొరికింది ఆ సమయంలో చార్లీ చాప్లిన్ కొన్ని కథాంశాలను ఎన్నుకొని తానే స్క్రీన్ ప్రే రాసి దర్శకత్వ బాధ్యత కూడా స్వీకరించారు  ప్రపంచవ్యాప్తంగా  డిక్టేటర్ సినిమా కథ గాని నటన కానీ పాత్రలను తీర్చిదిద్దిన పద్ధతి కానీ ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షించండి  ఆశ్చర్యపరిచింది  అంత హాస్యనటుడైన చాప్లిన్ ఒక నియంత పాత్రను పోషించి  మెప్పించడం  సామాన్యమైన విషయం కాదు  అలా తన జీవితాన్ని సినీ రంగానికి అంకితం చేసి  తన శ్వాస ఉన్నంతవరకు  ఆ రంగంలోనే ఎంతో కృషి చేసిన చార్లీ చాప్లిన్  శాశ్వతంగా అందరి హృదయాలలో నిలిచి ఉన్నవాడు. అంత హాస్యనటుడు చెప్పిన మూడు మాటలు  కష్టం నష్టం ఏది వచ్చిన శరీరానికి తప్ప నీకు కాదు  జీవితంలో ఏ రోజు నీవు నవ్వక పోతావో  ఆరోజు నీకు వృధా నీ కన్నీళ్లు కనిపించకుండా ఉండాలంటే వర్షంలో నడువు అన్నది  ఎంత గొప్ప జీవిత సత్యాలు.




కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం