నీచ ప్రవృత్తి- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒక తల్లి తన బిడ్డను  తనకు నచ్చిన పద్ధతిలో తీర్చిదిద్దుకుంటూ వస్తుంది  ఆ పద్ధతి తన సొంతం కాకపోవచ్చు  తల్లిదండ్రుల నుంచి కానీ  తాతల నుంచి గాని అనూచానంగా వస్తున్నది  కావచ్చు  దానినే మనం సంప్రదాయం అంటున్నాము  ఏ దేశ సంస్కృతి ఆదేశానికి ఉంటుంది  దీనికి ఎవరిని ఎవరు నిందించుకోవలసిన విమర్శించుకోవలసిన పనిలేదు  ఏ కుటుంబం అయినా హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో  పాశ్చాత్య  సంస్కృతి మనపై రుద్దపడి  విడాకులు అనే శబ్దం వచ్చింది  ఇతర దేశాలలో ఉన్న సంప్రదాయం సంస్కృతి  వారి పద్ధతిలో ఉంటుంది  ఏ ఒక్క మాట  తేడా వచ్చిన క్షణాలలో వాడు విడిపోతారు విడాకుల పేరుతో  అలా జరిగిన ఒక సంఘటన  జ్ఞాపకం చేస్తాను.
20 సంవత్సరాల లోపు వివాహమైన స్త్రీ  ఒక పుత్రునికి తల్లి అయిన తర్వాత  విడాకులు తీసుకుని మరొకరితో వెళ్లిపోతుంది  కాలం గడిచి  పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత  కొడుకు అని తెలియకుండా  వాడి వ్యామోహంలో పడి  అతనిని వివాహం  చేసుకుంటుంది. అది మనకు వినడానికి అసహ్యంగా ఉంటుంది  అలాంటి పరిస్థితి భారతదేశంలో కూడా వ్యాపించిందా అన్న  అనుమానం కలుగుతూ ఉంటుంది కొన్ని సంఘటనలను చూసిన తరువాత  కన్న తండ్రి  తన పుత్రికతో సంఘమించడం  భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ జరిగి ఉన్నది  కేరింతలు కొట్టే బుజ్జి తల్లి వయసు నుంచి  యవ్వనానికి వచ్చిన  ఆ బంగారు తల్లిని అనుక్షణం కాచి రక్షిస్తూ ఉన్న తండ్రి  అంత అమానుషానికి పాల్పడడం  చరిత్రలో  ప్రథమం.
ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు  ఆ బిడ్డ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వద్దు నాన్నా పిచ్చి పనులు చేయవద్దు అని బ్రతిమలాడుతున్న  తన బారి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసిన  రాక్షస ప్రవృత్తి కల ఆ తండ్రి  అంత ఘాతుకానికి పాల్పడ్డాడు అంటే  రాక్షసులలో కూడా అంతటి  నీ జాతి నీచమైన వ్యక్తులు ఉండరేమో అనిపిస్తుంది  బిడ్డ పెట్టే కేకలు విన్నప్పుడైనా  ఆ బిడ్డ చిన్ననాటి ధైర్యంతలు జ్ఞాపకం రాలేదూ అంటే  నిజంగా వాడు తండ్రి  అనిపించుకోవడానికి తగినవాడేనా  దీనికి కారణాలను ఆలోచిస్తే   తాగడం  ఆ మైకంలో మనసు పని చేయకపోవడం  ఇది నీచ కృత్యము  అని కూడా ఆలోచించగలిగిన శక్తి ఆ క్షణాన లోపిస్తుంది  అలా అని క్షమించగలమా  ఆ బిడ్డ బ్రతుకు ఏమైంది  ఆ పాప ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ దుర్మార్గుడు కాదా  అందరూ ఆలోచించవలసిన విషయం  మైకంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడవలసిన విషయం  ఇది ఎవరో చెప్పే విషయం కాదు ఎవరికి వారు ఆలోచించుకో వలసినది.


కామెంట్‌లు