జీవితమే నాటకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీవితం అంటేనే అనుకరణ అనుసరణ  కుర్రవాడు పెద్దలను చూసి వారు ఎలా చేస్తున్నారు దానిని అనుసరించడం తన కర్తవ్యం గా భావించి అలా నడుచుకోవడం. చంటి కుర్ర వాణ్ణి చూడండి  మనం కుంటుతూ నడుస్తూ ఉంటే వాడు కూడా అలాగే వస్తాడు వేగంగా వెళితే తాను అలా రావడానికి ప్రయత్నం చేస్తాడు  కనుక నటించే ఈ జీవితాన్ని నాటకంతో పోలుస్తారు చాలామంది జీవితం అంటే నాటకం  అలా నటించడమే తప్ప నిజమైన జీవితం కాదు అని వేదాంతపరంగా చెప్పడం  రకరకాల మనస్తత్వాలను కలిగిన వ్యక్తులను వేదిక పైన లేదా సినీ తెరపైన లేకపోయినట్లయితే ఆకాశవాణి ద్వారా చూస్తూ వింటూ ఉంటాం  అయితే ఆ నటీనటులు అందరూ కూడా ఇది నిజమేనన్న భ్రాంతిని కల్పించేలా ప్రవర్తించడం  నాటకం. అలా నటించగలిగినవాడు మంచి పేరు ప్రఖ్యాతిని తెచ్చుకుంటాడు  లేనివాడు ఎందుకూ పనికిరాని నటునిగా మిగిలిపోతాడు  ఈ నాటకం తయారు కావడానికి దర్శకుడు నిర్మాత కలిసి తెరవెనుక ఎంత కృషి చేస్తారో మనకు తెలియదు ముందు తమకు ఒక అభిప్రాయం ఉండాలి దానిని కథాక్రమంలో రాయగలిగిన రచయితను తీసుకోవాలి  ఆ రచయిత ఇచ్చిన కథను  సంభాషణ రూపంలో మనకు చెప్పగలిగిన నాటక కర్త దొరకాలి  ఆ నాటకాల్లో ఉన్న దృశ్యాలను దేని తరువాత ఏది ప్రదర్శించే యోగ్యత కలదు  దానిని దర్శకుడు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికా బద్ధంగా  రాసుకోవాలి దానినే స్క్రీన్ ప్లే అంటారు  మొత్తం పూర్తయిన తర్వాత ఏ వేషానికి ఏ నటుడు పనికి వస్తాడు  దానికి జీవం పోయగలిగిన వారు ఎవరు అని నిర్ణయించి వాడితో మాట్లాడి వారికి వేషం ఇస్తారు. తరువాత అనేక రోజులు సాధన చేసి దర్శకుని చెప్పు చేతల్లో ప్రతి నటి నటుడు  రాటు తేలిన తరువాత వేదిక పైన ప్రదర్శిస్తారు ఒక నాటకానికి ఇంత హంగామా నాటకానికి ఇంత ఆర్భాటం  కావాలి  తల్లి నవ మాసాలు మోయాలి  ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత నడకను నడతను మొత్తం తల్లిదండ్రులు నేర్పాలి  స్వయంకృషితో సమాజంలో ఎలా మెలగాలో అతనికి తెలియాలి  నాటకంలో ప్రక్క పాత్రలతో ఎలా మాట్లాడాలో  ఇక్కడ కూడా సమాజంలో ఉన్న మిగిలిన వారితో ఎలాంటి సన్నిహిత సంబంధాలను పెంచుకోవాలో  అంతా శిక్షణ ద్వారా నేర్చుకున్నదే తప్ప స్వతహసిద్దంగా బిడ్డ పుట్టగానే నేర్చుకునే విషయం మాత్రమే కాదు  మంచి పేరు సంపాదించుకున్నా చెడ్డపేరు సంపాదించుకున్నా అతని ప్రవర్తనే కారణం అవుతుంది. మన ప్రవర్తన చక్కని నడవడికతో ఉండాలన్న మాట.

కామెంట్‌లు