సహజ కవి దువ్వూరి రామిరెడ్డి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రెడ్డిగారు భౌతికంగా మనకు దూరమైనా  పాఠకుని  హృదయంలో  రామిరెడ్డి గారి కలం నుంచి జాలువారిన  ప్రతి అక్షరం నిక్షిప్తమై ఉన్నది  అంటే వారు మనకు ఎంత దగ్గరగా ఉన్నారో మనం ఊహించవచ్చు  వారి కలం దువ్వూరి రామిరెడ్డి గారిని  అజరామరుని చేసింది  సహజంగా ఒక కవి మరో కవి కవితని  ఆస్వాదించినా దానిలో ఉన్న మెరుగులను చెప్పగలిగిన వారు  చాలా అరుదు  రచనలో  తనను మించిపోయాడు అన్న  ఆలోచన తనకు వచ్చినప్పుడు  ఆ రచనలో ఉన్న లొసగులను బయట పెట్టడం తప్ప    సొగసులను ఎంచి  దానిని విశ్లేషణాత్మకంగా వివరించిన కవులు  సామాన్యంగా ఉండరు  డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి  డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి డాక్టర్ మరుకూరి కోదండరామిరెడ్డి అగస్త్య రెడ్డి వెంకు రెడ్డి గారు. అనేక రకాలుగా వారి కవితలను పొగుడుతూ  ఆ పొగడడానికి కారణాలను కూడా  తెలియజేస్తున్నా  కులాభిమానంతో వారు అలా చేస్తున్నారని  భుజాలు తడుముకున్న వారు లేకపోలేదు  వారికి సంబంధం లేని కులాలలో ఉన్నవారు  వారి కవితా ధారలో ఉన్న సుధను  ఆస్వాదించి  దాని రుచిని చెప్పిన  వారు ఎంతమంది  రెడ్డి కులానికి సంబంధం లేని వారు  అభినందనలు తెలియజేశారో  చెప్పడం కష్టం  విశ్వనాథ సత్యనారాయణ జంధ్యాల పాపయ్య శాస్త్రి  లాంటివాళ్ళు  రెడ్డి కులజులు కారు కదా. ఐజాక్ లాంటివారు  హిందూమతమే కాదు.  అనేకమంది ముస్లిం క్రైస్తవ  పాఠకులు కూడా  వీరి కవితా మాధుర్యాన్ని  రుచి చూచి  దాని వైవిద్యమైన విశిష్టతను తెలియజేసిన వారే కదా  సాహిత్యానికి కూడా కులాలను అంటగట్టే  సంకుచిత తత్వాలను  పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం లేదు  అని నా అభిప్రాయం.
పలిత కేశంలో ఒక్క  వాక్యం చదివితే  దాని అర్థం తెలిస్తే  రెడ్డి గారు అంటే ఏమిటో అర్థం అవుతుంది  అద్దం ముందు గడ్డం గీసుకోవడానికి కూర్చుని  తన మీసంలో ఒక వెంట్రుక  తెల్ల బడడాన్ని గమనించి  వ్రాసిన కవిత ఫలిత కేశము  తణుకున మెరిసే ఒక పలిత కేశం అన్న శబ్దం  వాడడం ఒక్క రెడ్డి గారికి మాత్రమే సొంతం  ఆధ్యాత్మిక చింతన ఏ వ్యక్తికైనా  ఏదైనా ఒక సంఘటన కానీ  ఒక సందర్భం కాని ఎదురైనప్పుడు  ఆకస్మాత్తుగా వస్తుందని స్వామి వివేకానంద చెప్పారు  అలాంటిదే ఈ వాక్యం  పండిపోయిన వాడిని విజ్ఞాని అంటారు  నాకు తెలియకుండానే  ఇది ఇలా ఆవిర్భవించింది  అని చెప్పడం  ఆయన మేధో శక్తికి  నిదర్శనం కాదా అని అడిగిన దానికి సమాధానం చెప్పగలరా  జాషువా గారిని తన శిష్యులు ఎస్.టి జ్ఞానానందకవి  అడిగాడు.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం