సహజ కవి దువ్వూరి రామిరెడ్డి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు  మంచి సాహితీవేత్త  నిజాయితీకి మారు పేరు  ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు  ఎన్ని అడ్డంకులు వచ్చిన దానిని చేసి చేరవలసినదే  మంచి వక్త  కవి రచయిత కూడా  శ్రీ శ్రీ కి ముందే అభ్యుదయ కవిత్వం ఏమిటో రుచి చూయించినవాడు కట్ట  మంచి  మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం  ప్రారంభమైనప్పుడు రామస్వామి రెడ్డి యార్ మొదటి ముఖ్యమంత్రి రెడ్డి  కులజుడు తరువాత రాజాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్  కట్టమంచి అసెంబ్లీలో  ఉన్నారు  రాజాజీకి రాజకీయాలు తెలియవని  రెడ్డిగారికి తెలుసు  ఒక సందర్భంలో రాజకీయ నాయకుడివై ఉండి  తమిళ్ అయినా  పొలిటికల్ సైన్స్ చదవవా అని  అప్పా దొరై  రాసినది ఒకసారి చదువు అని  సలహా ఇచ్చిన ధైర్యశాలి. వెంటనే రాజాజీ  రాజీనామా పత్రం తీసుకొని రామస్వామి వారి దగ్గరికి వెళ్లి  కట్టమంచి ఉంటే నేను అసెంబ్లీలో ఉండను  అన్నప్పుడు రెడ్డి గారిని పిలిచి  వారితో రాజీనామా చేయించారు  రాజాజీ వెళ్లిపోయిన తర్వాత నన్నేం చేయమంటారని రెడ్డి గారు అడిగితే  ఆంధ్రాలో మనకు  విశ్వవిద్యాలయం లేదు  సరైన స్థలం చూసి ఏర్పాటు చెయ్ అని పంపారు గుంటూరు వచ్చి చూస్తే అక్కడ పరిస్థితులు ఆయనకు నచ్చలేదు  అప్పట్లో బెజవాడ వచ్చి  జూన్లో ఎండలు  చూసి భయపడి  థిస్ ఇస్ నాట్ బెజవాడ  థిస్ ఇస్ బ్లేస్ వాడ  ఇక్కడ చదివితే నా పిల్లలు నల్లబడిపోతారు  అని విశాఖ వెళ్లి  అక్కడ వాతావరణం  గమనించి కలెక్టర్ తో  మాట్లాడి నేటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వాడు  మొదటి వైస్ ఛాన్స్లర్ కూడా వారే. ఒక పర్యాయం విజయవాడలో తన ఉపన్యాసం  కాలేశ్వర రావు మార్కెట్ దగ్గర ఇస్తున్నప్పుడు  రెడ్డిగారు సహజంగా హాస్య ప్రియుడు  హాస్యోక్తులు లేకుండా వారి  ప్రసంగం ఉండదు  ఇక్కడ ఆవు పాలు దొరుకుతూ ఉంటే  ఆవును కొని దానిని కావలసిన సకల సౌకర్యాలు చేసి కష్టపడవలసిన అవసరం ఏముంది  అన్నారు  విశాఖలోనే చదువుతున్న ఒక పీహెచ్డీ విద్యార్థిని  అది విని రెండు రోజులు అయిన తర్వాత  వారి గదికి వెళ్లి  నేను మీతో  ఒకరోజు  గడపాలని ఉంది  ఏమంటారు అంటే  నువ్వు ఏం చదువుతున్నావ్ అని అడిగారు  పీహెచ్డీ  అన్నది  ఏ అంశాన్ని గురించి అంటే మానవ సంబంధాల గురించి  అన్న సమాధానం రాగానే  ఇక్కడ మనందరి సంబంధం ఏమిటి గురు శిష్య  వీరి బంధం ఎలా ఉండాలి  అని అడిగితే దానికి సమాధానం లేదు.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం