సహజ కవి దువ్వూరి రామిరెడ్డి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 గురువు తండ్రి లాంటి వాడు  నీవు నా బిడ్డ లాంటి దానివి. ఏ రాక్షసపు తండ్రి అయిన  కన్న కూతురిని కాముక దృష్టితో చూస్తాడా చక్కగా చదువుకో నీకు మార్కులు రాకపోయినా  నిన్ను ప్రథమ శ్రేణిలో పాస్ చేస్తాను వెళ్ళు  అనగానే  పాదాభివందనం చేసి  విజయవాడలో మీరే చెప్పిన మాటలను ఆధారం చేసుకుని మీ మేధా సంపత్తి తెలియక. నన్ను క్షమించండి మళ్ళీ జన్మలో ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను  అనే హామీ ఇచ్చి వెళ్లింది  అంత నిష్టాగరిష్ఠుడు  అనేక మంది గ్రంథాలకు పీఠికలు రాసిన వారు  వేమన పద్యాలను వెలికి తీసి  దానికి అర్థ తత్పర్యాలు  తెలుగులో చెప్పించి  తాను ఆంగ్లంలో దాని అర్థాన్ని వ్రాసిన  చరిత్రకారుడు  వారికి నచ్చిన కవి దువ్వూరి రామిరెడ్డి  గారు  వారి గ్రంథానికి పీఠిక కూడా వ్రాశారు  వారు వ్రాసినది యధాతధంగా  మీకు అందిస్తున్నాను. కృషివరుడు ఉపోద్ఘాతం  ఇది కవికోకుల దువ్వూరి రామిరెడ్డి వెలయించిన కావ్యాలలో మూడవది  కానీ సి ఆర్ రెడ్డి గారు వ్యాఖ్యానించినట్లు కృషీవలుల జీవితమును ప్రధానాంశంగా గ్రహించిన  తెలుగు  గ్రంథములలో ఇది మొదటిది  గృహ విద్యాలయ శిక్షకుడు  ఏ ప్రోడక్ట్ ఆఫ్ హోమ్ యూనివర్సిటీ అయిన రామిరెడ్డి గారు ఈ కృతి రచనకు  1919 పూర్వం  1917లో నెల్లూరున జరిగిన రెడ్డి జన మహాసభకు అధ్యక్షత వహించిన  డాక్టర్ సి ఆర్ రెడ్డి గారి చేతుల మీదుగా సువర్ణ పతకాన్ని అందుకున్నారు. 1924లో రామిరెడ్డి గారు తన కవిత ఖండికలను కొన్నింటిని ఆంగ్లంలోనికి పరివర్తించి  ది వాయిస్ ఆఫ్ ది రీడ్ అనే పేరుతో వెలువరించారు  అనిబిసెంట్  అనుచరుడై  జియో ఫిజికల్ సొసైటీకి సారధ్యాన్ని వహించి  భారతీయ ఆత్మను ప్రపంచానికి విప్పి చెప్పిన జేమ్స్ కజిన్ గారికి  సి ఆర్ రెడ్డి గారికి ఈ కృతి అంకితమియ్య బడింది. బ్రిటిష్ ఎంపైర్ ఎడిషన్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెట్రీలో  రామి రెడ్డి గారి పద్యాలు మూడు ప్రకటిదమయినాయి  విదేశీయులైన కవితా సంకలన కర్తలు తెలుగు కవిత ఈ విధంగా గౌరవించడం ఇదే ప్రథమం  ప్రస్తుత పీఠిక కవి కోకిల గ్రంధావళి  1935లో ప్రచురించబడిన దాని నుంచి గ్రహించబడినది  ఈ సంపుటికి రామిరెడ్డి గారికి గురుప్రాయుడైన అభినవ తిక్కన బిరుదాంకితులు దుర్భ సుబ్రమణ్య శర్మ గారి  గారు సమకూర్చిన  తొలి పలుకు సహృదయ బాటకులకు   పరిశీలనార్థమై ఉన్నది  ఆంధ్ర వాంగ్మయమున ప్రకృతము ప్రసిద్ధికి వచ్చుచుండెడు  గన్యములను నూతన సృష్టులలో ఈ కావ్యమొకటి  విషయమందును భావములందును ఇది మన దేశము యొక్క నవ జీవితమునకు చేరినది.

కామెంట్‌లు