ఆప్యాయతలు- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 ఈ భూమి మీదకు వచ్చిన ఏ బిడ్డా పుట్టుకతోనే అన్ని  నేర్చుకోడు నేర్చుకోలేడు నీరు త్రాగడం ఎలా  అన్నం కలిపి అమ్మ ముద్దలు పెడితే దాని రుచి వాడికి తెలుస్తుంది  కొంచెం పెరిగి అన్నం తినేటప్పుడు  వాడి పళ్ళెం చుట్టూ ఎంగిలి వేస్తూ ఉంటే  అలా వేయడం తప్పు అని  బిడ్డ తప్పును సరి చేసేది తల్లి రోడ్డు మీదకు వెళ్లాలంటే చేయి పట్టుకుని నడిపించి  పరిస్థితులను అర్థమయ్యేలా చెప్పేవాడు తండ్రి  బిడ్డ తన కన్నా ముందుచూపుతో జీవితాన్ని గడపాలన్న అభిప్రాయంతో బిడ్డను  భుజాలపై కూర్చోబెట్టుకుని  నా కన్నా నా బిడ్డ  చాలా ఎత్తులో ఉన్నాడు అని మురిసిపోయేవాడు  తండ్రి  అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే  విద్యాబుద్ధులు నేర్చుకుని మంచి స్థితికి వస్తాడు అక్కడ ఏం చేయాలో తల్లిదండ్రులు చెప్పరు. కానీ వయస్సు ప్రభావం వల్ల  అతని చుట్టూ స్నేహ బృందం వచ్చి వారిని అలవాట్లను వీరికి బదిలీ చేస్తారు  అది మంచి అలవాటో చెడ్డ అలవాటో వాడికి తెలియదు  కానీ ఒకసారి అలవాటు పడిన తర్వాత దానికి దూరం కావడం  అతని వల్ల అయ్యే పని కాదు  ఎవరైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు  ఆమెతో స్నేహాన్ని పెంచుకొని పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధపడతాడు  ఆ పిల్ల ఎవరో వారి స్థితి ఏమిటో  తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో  అన్న ఏ విషయాన్ని ఆలోచించే స్థితిలో అతను ఉండడు  వయస్సు ప్రభావం కావచ్చు  స్నేహితుల వల్ల కావచ్చు  అనేక కారణాల వల్ల మనసు సంచలంగా ఉండి  అలాంటి అలవాట్లు  వస్తాయి  వాటి నుంచి దూరం కావడానికి చాలా ప్రయాస పడాలి.
అదే ఆడపిల్ల అయితే  వెళ్ళేది చదువుకోవడానికి  చేసేది  ప్రేమ కలాపం  దానితో హత్యలు ఆత్మహత్యలు  అయినా తల్లిదండ్రులు ఏ విషయం చెప్పరు వాళ్లకు  ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల కుటుంబ నియంత్రణతో  బిడ్డలకు భయభక్తులు నేర్పడం  తల్లిదండ్రులకు  చర్చగా మారింది  మంచి విషయాలు చెప్పితే ఎక్కడ  మమ్మల్ని హత్య చేస్తాడో అన్న భయం  లేకుంటేవిరక్తి చెంది తానే ఆత్మహత్యకు పాల్పడడం  చేస్తాడేమోనని భయం పిల్లలు చేసే పనులు పెద్దలకు తెలియకపోవు  అయినా ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నారు అంటే  ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు సంప్రదాయబద్ధంగా జీవితాలను కొనసాగించడం  తగ్గి ఎవరికి వారు  ఆత్మీయతలకు  దూరంగా బ్రతకడం వల్ల  నేను అన్న స్వార్థమే పెరిగింది తప్ప  మనము అన్న  విచక్షణ లేకుండా పోయింది  అమ్మానాన్న వచ్చినా చుట్టం చూపుగా  రావడం తప్ప  బిడ్డల ఆప్యాయతను పొందటానికి మాత్రం కాదు  అన్నది  సత్యం.


కామెంట్‌లు