శిష్యరికం- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రామకృష్ణ పరమహంస  శిష్యరికంలో ప్రపంచం మొత్తం తిరిగి  భారతదేశ ఔనత్యాన్ని గురించి తెలియజేసిన ఏకైక వ్యక్తి  స్వామి వివేకానంద. జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు భరించి జీవిత ధ్యేయం ఆధ్యాత్మికమే అని నమ్మి  దానితోనే మైత్రి చేసిన వాడు  నరేంద్ర  అలాంటివాడు ఇతర దేశాలకు వెళ్లి  భారతదేశపు మనస్తత్వాలను అర్థం చేసుకోలేదా  ప్రపంచానికి వెలుగు చూపే నా దేశం గొప్పతనం ఇది అని చెప్పడం  వారికే కాదు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గర్వకారణం  రెండు నిమిషాలు మాట్లాడడానికి అంగీకరించని సభ  వారి ఇష్టం వచ్చి అంతసేపు మాట్లాడవలసిందిగా కోరారు అంటే ఆయన వాక్చాతుర్యం  సర్వకాల సర్వావస్థల్లో అందరికీ పనికి వచ్చే నీతి బోధక వాక్యాలు కారణం. స్వామి వివేకానంద చెప్పిన మొదటి వాక్యం  శత్రువు ఒక్కడు ఉన్నా అది ఎక్కువే  మిత్రులు వందమంది ఉన్న అది తక్కువే  శత్రువుని శత్రువుగా చూడకూడదు అంటాడు  అతనిలో అనేక మంచి కోణాలు ఉంటే ఉండవచ్చు  వాటిని ప్రజ్వలింప చేస్తూ అతనిలో ఉన్న శత్రుత్వ భావాలను నశింప చేసేలా దహించి వేయాలి  అన్నది ఆయన ఉద్బోధ స్వతహాగా ఆయనకు మైత్రి గుణం ఉండబట్టి ఇతర దేశాలలో కూడా మన తత్వాన్ని  తెలియజేయడానికి  శక్తి కలిగి ఉంది  అలాంటి మహానుభావులు భారతదేశంలో ఉండడం వల్ల  మన దేశ ఔన్నత్యం  విపరీతంగా పెరిగింది అనడంలో ఆశ్చర్యం లేదు  అతిశయోక్తి అంతకన్నా కాదు అలాంటి వివేకానంద స్వాములు  అప్పుడప్పుడు మాత్రమే ఈ భూమి మీదకు వస్తూ ఉండడం విశేషం  గీతలో చెప్పినట్లు  అన్యాయం పెరిగినప్పుడు  దుష్ట శిక్షణ కోసం  ఇలాంటి మహానుభావుడు ఉద్భవిస్తూ ఉంటారు. ధన సాధన సంపత్తి   లేనివారైయు  బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని సుఖాలు సాధించు కొందురు అనేది  విష్ణు శర్మ వ్రాసిన మిత్ర లాభంలో మొదటి వాక్యం  కలిగిన దానిని పంచుకోవడం రహస్యాలు అన్నీ చెప్పుకోవడం సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆపదలో ఒకరినొకరు రక్షించుకోవడం  ప్రీతిని తెలిపే కోణాలు తెలిస్తే  దేవతలే సంతోషిస్తారు కేవలం గడ్డి వేసినందుకు తన దూడ సంగతైనా చూడకుండా గడ్డి వేసిన వారికి ఆవు పుష్కలంగా పాలిస్తుంది  ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నపుడు ఈ నిజమైన ప్రేమతో కూడిన బంధం ఏర్పడుతుంది  అదే మిత్రబంధం  ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమలాడడం నేర్చుకో ఎందుకంటే  నీ మెడ హారంలో ఒక బంగారు పూస దొరికే దాకా వెతుకుతావు కదా  నీ మనసెరిగిన స్నేహితుడు అంతకంటే ఎక్కువేగా అన్న విషయం మర్చిపోతే ఎలాగ.


కామెంట్‌లు