శారదా నవరాత్రులు;- "రసస్రవంతి" & " కావ్యసుధ "చరవాణి : 9247313488-హయత్ నగర్ : హైదరాబాద్
  ఇది శరత్కాలం. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఆ రోజు నుంచి శరత్ ఋతువు వస్తుంది.ఈ మాసంలో శుక్లపాడ్యమి నుంచి తొమ్మిది రోజులను శరత్ నవరాత్రులు లేదా శారదా రాత్రులని ఈ కాలంలో జరిగే ఉత్సవాలను శరన్నవరాత్రి ఉత్సవాలని అంటారు.
అన్ని రుతువుల్లో కన్నా శరదృతువులో వచ్చే చంద్రకాంతి ఎంతో     ఆహ్లాదాన్నిస్తుంది. శరత్కాలంలో ఉద్భవించిన 'అమ్మ' శారద గా పూజలు అందుకుంటోంది. అందుకనే ఇవి శారద రాత్రులయ్యాయి.
శరత్కాలంలో రాత్రిపూట ఆకాశాన్ని పరిశీలిస్తే, సింహరాశిపై కన్యారాశి స్పష్టంగా కనిపించి సింహవాహనంపై ఆది పరాశక్తి నిలిచివున్న దృశ్యం కన్పిస్తుంది.
ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో పవిత్రమైనవి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమితో పరిసమాప్తమయ్యే నవ రాత్రుల్లో కలశపూజ, కుమారీపూజ, సహస్రనామావళి, శ్రీచక్రారాధన, సప్తశతీ పారాయణ ఎంతో ముఖ్యమైనవి.
అనాది విద్యకు అధిష్ఠాత్రి అవడం. వల్ల పరమేశ్వరిని ఆదిశక్తిగా భావించడం భావ్యం, దుష్ప్రభావాలు గల మనస్సులను తన ఉగ్ర, సౌమ్య, సుందరరూపాలతో మార్చివేసి మానవత్వం వెలుగును ఇచ్చే శ్రీ చక్రదేవతామూర్తి జగదంబ.
శ్రీలలితా పరమేశ్వరిని ధ్యానించే చేతులే చేతులు. సహస్రనామార్చన చేసే వాక్కే వాక్కు అని శాస్త్రవచనం.
శక్తి కలసివున్నప్పుడే శివుడు (పర మాత్మ) సృష్టిచేయడానికి సమర్థుడవు తాడు. శక్తితో కలసి లేకపోతే ఆయన కదల డానికి కూడా సమర్థుడు కాదు. అందు పల్లే హరిహర బ్రహ్మాదులంతా ఆ శక్తినే ఆరాధిస్తూవుంటారు.
దేవీనామం అతి పవిత్రం. విష్ణువును స్మరించడం ఉత్తమం. శివనామస్మరణ మేలు కలిగిస్తుంది. శ్రీ పీఠంపై కొలువై వున్న మహాశక్తిని ఆశ్రయించి అర్చించే పవిత్ర నవరాత్రి ఉత్సవాలు సర్వమాన వాళికీ సర్వసుఖాలను ప్రసాదిస్తాయి.
కామెంట్‌లు