హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 366
🦚🦚🦚🦚
పనులను పక్కకు నెట్టి
కోరు కోరికలు చాలిక......!
అడిగినను అడగకున్నను
యోగముతో నెరవేరిక.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 367
🦚🦚🦚🦚 
సంచిత పాప కర్మల
అనుభవైక కొలమానం...!
నయవంచనల నడుమ
వీరి జీవన యానం........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 368
🦚🦚🦚🦚
తాము చేసే తప్పులు
కనిపించవు! తమ కనులకు..!
ఎదుటివారి ఎదుగుదలలు
నచ్చవు! తమ మనసునకు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 369
🦚🦚🦚🦚 
అర్భక ముసలి పక్షికి
పిల్ల పక్షి కుక్షి నింపు.......!
యువకులేమో వృద్ధులను
పస్తులుంచి సాగనంపు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 370
🦚🦚🦚🦚 
చెడుగుడు పనులకు
కొందరు మద్దతిస్తారు...!
నిలువరించడానికి
పరులు విభేదిస్తారు....!!
                     (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు