హరివిల్లు 391
🦚🦚🦚🦚
విపరీత పోకడలతో
విడివడు మూడుముళ్లు...!
చెడుగుడు చ్యేష్టలతో
కాపురాలకు తెగుళ్ళు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 392
🦚🦚🦚🦚
శత ఇటుకల రవాణాకు
పాత సైకిలు వరేణ్యం....!
కటిక పేదరిక జనులకు
సాహసమే శరణ్యం........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 393
🦚🦚🦚🦚
తమ పనులు చేయగానే
వారి బాధ్యతలు తీరవు....!
లక్ష్యం నెరవేరు వరకు
తమ బాధ్యతలు వదులవు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 394
🦚🦚🦚🦚
ఒక్కొక్క మెతుకును ఏరి
భుజించకు! ఇష్టమైనను....!
అతి పెద్ద ముద్ద జేసి
తినవద్దు! ఎవరైనను........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 395
🦚🦚🦚🦚
నీకు పొగాకు చుట్ట
ఇష్టమని మురిసిపోకు....!
మాకు ఆరోగ్యం పైన
ధ్యాసుందని మరువకు....!!
(ఇంకా ఉన్నాయి)
హరివిల్లు రచనలు ;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి