హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 396
🦚🦚🦚🦚
భేదాభిప్రాయాలు
సహజసిద్ధ లక్షణాలు....!
సమాజాభివృద్ధికి
కట్టుబాట్లు సరిత్రోవలు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 397
🦚🦚🦚🦚
పిడికిలితో అదిమి పట్టు
ధైర్యపునడక తొలిమెట్టు.! 
పాల పిట్ట జమ్మి చెట్టు
విజయాలు తెచ్చి పెట్టు.!!
🦚🦚🦚🦚
హరివిల్లు 398
🦚🦚🦚🦚
ఉపయుక్త కర్తవ్యాలు
ఉత్తమ ప్రయోజనాలు....!
విజ్ఞతతో వదులుకో
స్వ ప్రయోజనాలు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 399
🦚🦚🦚🦚
చివరి వరకు పోరాడిన
భయమనునది ఉండదు!
ఎదురీతలకు భయపడి
వెనుదిరుగుట సరికాదు!!
🦚🦚🦚🦚
హరివిల్లు 400
🦚🦚🦚🦚
కుర్చీలో హాయిగా
పడుకొని విశ్రమించరు..!
జయమే ధ్యేయంగా
ఓర్చుకొని శ్రమించెదరు.!!
              ( ఇంకా ఉన్నాయి )
కామెంట్‌లు