హరివిల్లు రచనలు కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 401
🦚🦚🦚🦚
అవగాహన లోపించిన
ఉద్భవించదు అనుభూతి
అనుభూతికి లోనైన 
సాధ్యపడునుసానుభూతి
 
🦚🦚🦚🦚
హరివిల్లు 402
🦚🦚🦚🦚
చెడిపోవుట మొదలవును
చెడుగుణపు చేతలవలన
చెడు విస్ఫోటన మగును
ప్రశ్నలుమరుగవుటవలన
 
🦚🦚🦚🦚
హరివిల్లు 403
🦚🦚🦚🦚
వ్యవస్థీకృత ఉద్యమ
జోరు హోరు నిలవాలి..!
అబద్ధపు వార్తల సృష్టి 
గట్టిగా అరికట్టాలి........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 404
🦚🦚🦚🦚
భ్రమరముల నేర్పు
భవ్యమైన తీర్పు...........!
విరుల నుండి తేనె గ్రోలు
లీల దివ్యమైన కూర్పు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 405
🦚🦚🦚🦚
కట్టుబాట్లు కాదనుకుని
తిరిగితే విపత్కరం.......!
కట్టుబాట్లు నిలబెట్టిన
సంతోష పరిష్కారం......!!
              ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు