హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 416
🦚🦚🦚🦚 
దుఃఖం వస్తే, వర్షం 
కురిసిన బాగుండును.....!
ఓదార్పులు లేనందున
తడిసి కానరాకుండును....!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 417
🦚🦚🦚🦚 
తనకు శక్తి కలదని 
గుర్తుండదు! బానిసై......!
తనకు యుక్తి యుందని 
స్ఫురించదు! బానిసై.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 418
🦚🦚🦚🦚 
ఒక్క మెట్టెక్కగానే
గట్టెక్కినానుకోకు....!
ఒదిగి ఒదిగి ఎదిగే
ప్రయత్నాలు మానకు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 419
🦚🦚🦚🦚
  *చ(చె)రవాణి*
మాయచేసి తనవైపు
చూసేట్లు ఆకర్షించు.....! 
వంచిన తలెత్తనీయక
నయవంచనగ ముంచు.!!
🦚🦚🦚🦚
హరివిల్లు 420
🦚🦚🦚🦚
 *నిర్లక్ష్యం*!!
లక్ష్య సాధనలకిది
అసలు పనికి రానిది......!
శతృవు కన్నా బలపడి
వెనుకడుగు వేయిస్తుంది.!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు