హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 331
🦚🦚🦚🦚
అందిన సదవకాశమును
సదా వదులుకోవలదు.....!
ఆలోచనల సమయమును
వృధాయని విడువవలదు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 332
🦚🦚🦚🦚 
అసలు మిత్తి కలిపి
కట్టాలని తాఖీదులు...!
ఋణాలు ఎగవేసిన 
వారికే పిలిచి వరాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 333
🦚🦚🦚🦚
అతి శీతల చలితో
వీచిన ఈదురు గాలులు...!
నీరు హిమముగ మారిన 
సాదృశ్య రమణీయతలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 334
🦚🦚🦚🦚 
చెడు నంతా ఒక్క చోట
చేర్చి దహించి వేయవలె....!
పంచడానికి సిద్ధమై 
మంచిని గ్రహించవలె........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 335
🦚🦚🦚🦚 
ద్వేషించు వారిని పిలిచి
చేరదీసారు అమ్మలు.......!
తమ తనయులే సాకక
వృద్ధాప్యములో వ్యధలు....!!
              (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు