హరివిల్లు 336
🦚🦚🦚🦚
చుక్క చుక్క నీరేయని
చులకనగా చూడబోకు...!
చక్కగ కాపాడుకునే
తపనను మరువబోకు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 337
🦚🦚🦚🦚
మిడిమిడి తెలివిని
విడవమంటుంది మామిడి..!
త్యాగమయిగ గడుపుతుంది
రెమ్మల తోరణ మామిడి......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 338
🦚🦚🦚🦚
విరివిగ పలువురిని పిలిచి
ఉచిత పథకములు అమలు..!
అసలు కొసరుల ఎసరులతో
ఆవిరిగ ఎగురు వనరులు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 339
🦚🦚🦚🦚
దోసెడు నీళ్ళతో ఉదయ
సూర్యునకు వదులు అర్ఘ్యము.!
నేలకు వెనుదిరుగు సుజల
జనహర్ష ప్రియ వర్షము.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 340
🦚🦚🦚🦚
అతని పలకరింపునకు
నా మనసు పులకరించు...!
ఇతని ఈసడింపులకు
నా మనసు తిరస్కరించు....!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
చుక్క చుక్క నీరేయని
చులకనగా చూడబోకు...!
చక్కగ కాపాడుకునే
తపనను మరువబోకు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 337
🦚🦚🦚🦚
మిడిమిడి తెలివిని
విడవమంటుంది మామిడి..!
త్యాగమయిగ గడుపుతుంది
రెమ్మల తోరణ మామిడి......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 338
🦚🦚🦚🦚
విరివిగ పలువురిని పిలిచి
ఉచిత పథకములు అమలు..!
అసలు కొసరుల ఎసరులతో
ఆవిరిగ ఎగురు వనరులు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 339
🦚🦚🦚🦚
దోసెడు నీళ్ళతో ఉదయ
సూర్యునకు వదులు అర్ఘ్యము.!
నేలకు వెనుదిరుగు సుజల
జనహర్ష ప్రియ వర్షము.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 340
🦚🦚🦚🦚
అతని పలకరింపునకు
నా మనసు పులకరించు...!
ఇతని ఈసడింపులకు
నా మనసు తిరస్కరించు....!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి