హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 341
🦚🦚🦚🦚
ఓ చెట్టుకు చిగురించి
భువి చేరిన పండుటాకు...!
మా మట్టుకు కనిపించే
ఎర్రని పెదవులు మాకు ....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 342
🦚🦚🦚🦚 
నూతనత్వముతో కొలిచి
వేయాలి ప్రణాళికలు........!
మానవత్వముతో పిలిచి
నేర్పించాలి మెళకువలు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 343
🦚🦚🦚🦚
ప్రకృతి పరవశించి
అందించిన విచిత్రమా...!
ఆకృతి నాస్వాదించి
పొందిన ఆనందమా......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 344
🦚🦚🦚🦚 
ఏమిచ్చినా తీరదు
కదా! భార్యా ఋణం...!
ఏ సమస్యా తేవలదు
అది అవదా ఆభరణం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 345
🦚🦚🦚🦚 
గడిచిన కాలాల
జ్ఞాపకాల దొంతరులు.......!
రాబోవు రోజులకవే
పరిజ్ఞానపు వనరులు........!!
              (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు