హరివిల్లు రచనలు ; - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 346
🦚🦚🦚🦚
సప్త వర్ణ హరివిల్లే
పలుశోభలకు మూలం...!
పూర్ణ అక్షరాస్యతే
జగతి ఖ్యాతికి మూలం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 347
🦚🦚🦚🦚 
తనచుట్టే అల్లుకున్న
అత్యాశల వల(యం)లో...!
తనకు తన వారందరికి
చుక్కెదురే పడ(వల)లో....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 348
🦚🦚🦚🦚
గత జీవన విజయాలను
గ్రంథరూపముగ మలుచుము..!
భావి జీవితాశయలను
ముందుండి నెరవేర్చుము....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 349
🦚🦚🦚🦚 
భక్తి భావములో
ఆర్భాటం పనికిరాదు...!
భక్తి సాధనలో మనో
చాంచల్యము పొసగదు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 350
🦚🦚🦚🦚 
గడిచిన కాలంలోని
చెడును నిర్మూలించు...!
రానున్న కాలానికి
మంచినే ప్రోత్సహించు...!!
              (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు