ఓటుకు నోటు డి. వినాయకరావు , బైంసా సెల్ 9440749686
కం:ఓటుకు నోటంటచ్చున్
చేటును జేయంగ ప్రజల స్తీర్విని త్రాగన్
ధీటుగ జెప్పుము నేతకు
నోటుకు ఓటమ్మమంటు నొచ్చెడి మాటన్

ఉ:యెత్తుల నేయుచుందురుగ యెత్తుక పోనవి వోట్లనన్నిటిన్
మత్తులొ ముంచు నోటరును మాయల నేతలు జెప్పి మాటలన్
జిత్తుల మారి నక్కలవి చిత్తము చిధ్రము జేయ వచ్చు, నీ
సత్తును చాటు వోటరుగ చక్కని నేతను యెంచ బుద్దితో


కామెంట్‌లు