ఓటు - ఓటరు -ఎన్నికల పై పద్యాలు;- డి. వినాయకరావు , బైంసా సెల్ 9440749686
1. ఉ:వారు మహాత్ము లౌవుదురు వంచన నెర్గని లోక పాలకుల్
మారును తాము కోరరుగ మంచిని యెంచు గుణంబు వారిదిన్
భారతి గోరు వారి నిల పాలకు లవ్వను లోక రక్షకై
వారినె వోటరెంచగను భాగ్యము భద్రత నొందు భారిగన్

2.సీ:ప్రజల నాయుదమయ్యె పదునైన ఓటాయె
యెకిమీడు నెంచంగ యెన్ని కలలొ
పల్లెటూరైనేమి పట్టణంబైనేమి
ఓటరు విడరాదు ఓటు హక్కు
ప్రార్థనల్ జేయుచు ప్రాదేయ పడుదురు 
ఓట్లనమ్మండంటు  నోట్లనిచ్చి
ప్రజలమేలునుగోరే పాలకున్నెంచుము 
బకవేషి నోట్లను వద్ద నంటు
ఆ.వె:ఐదు వత్సరములు అదికార మిచ్చేడి 
వోటు విలువ నెరిగి మీట నొక్కు 
ప్రజల ఆయు దమ్ము పాలకున్నెంచేది
వోటు శక్తి జూపు వోట రన్న

3.కం:ఎన్నికల సమర మొచ్చెన్
సన్నద్దముకండి ఓటు సరిగా వేయన్
పన్నాగము పసిగట్టుము
కన్నము వేసేను నేత కదనము నెగ్గన్

4.ఉ:యెత్తుల నేయుచుందురుగ యెత్తుక పోనవి వోట్లనన్నిటిన్
మత్తులొ ముంచు నోటరును మాయల నేతలు జెప్పి మాటలన్
జిత్తుల మారి నక్కలవి చిత్తము చిధ్రము జేయ వచ్చు, నీ
సత్తును చాటు వోటరుగ చక్కని నేతను యెంచ బుద్దితో

5.కం:ఓటుకు నోటంటచ్చున్
చేటును జేయంగ ప్రజల స్తీర్విని త్రాగన్
ధీటుగ జెప్పుము నేతకు
నోటుకు ఓటమ్మమంటు నొచ్చెడి మాటన్

6.ఉ:వేయుము ఓటు తప్పక, వివేకము చాటుము మాసి, బాధ్యతన్
న్యాయము మర్వబోకుమవి నాయకు లెంచగ యెన్నికల్లలో
 మాయల నేత  నీమనసు మార్చును నివ్వగ లంచపంచముల్
ఛాయది కాదు శాశ్వతము శస్తము నివ్వదు యెర్గు నిక్కమున్

7.కం:గణతంత్రరాజ్య మయ్యెన్
పణముకు కొదువంటు లేని భారత దేశం
జనమే యెంచును ప్రభువును
ఘనమగు వోటేసి తాము గణనము నందున్

8.చం: ప్రజలకు భాగస్వామ్యమగు పాలన భద్రత నిచ్చు, లోకులం
త జయము, వృద్ధి నొందుగను  తాము నుదాస్థితులవ్వ మేలగున్
ప్రజలచె ప్రాభవంబు నడ ప్రాంతమదొందు పురోభి వృద్ధిగన్
సుజనులు కాగ పాలకులు శోభితమొందును రాజ్యమెప్పుడున్

9.కం:రానున్నవి యెన్నికలున్
హ్వానము క్వాణముల గర్జ నదికంబవ్వున్
 గానము గారడి జేయున్
జానుగులవి నొందు నొప్పి శ్రవణమదికమై

10.కం:ఎన్నికల సందడచ్చెన్
యెన్నెన్నో వరము లివ్వ యెగబడి వచ్చున్
బన్నము యెర్గని వోటరు
తన్నుగ మైమరచి నమ్ము తక్కిడి నేతన్

11.కం:నాటకమిది పరిగణనము
బూటక వాగ్దత్తముండు పొందన్ వోట్లన్
మాటలమారగు గుటిలుడు
వోటరు నొప్పించ వచ్చు పొందగ సిద్ధిన్

12.కం:వోటరు విను నిక్కమిదిన్
దీటది కాదుగ నుచితము తీర్చదు తిప్పల్
పాటది దెచ్చును గనుమా
చాటున దాగుండ గొప్ప జంజాటంబున్

కామెంట్‌లు