112.మనుషులు భౌతికంగా,ఎన్నో విజయాలు !వారి మనసుల మధ్య,తరగని గజాల దూరాలు!కోతుల నుండి పుట్టారు,ఈనాటి మానవులు!నేటికీ కోతులు సమూహాలై,ఒకటిగా జీవిస్తున్నాయి!నరులకు ,ఆ వానర లక్షణం రాదా?113.మనిషి మనిషిని,ప్రేమించలేడు !సాటివాడి అభివృద్ధి,సహించలేడు,!పరులు విజయానికి,ఓర్వలేడు !పెద్దలకు నమస్కారం,పిల్లలకు ఆశీర్వచనం!నేడు ప్రతి నరుడు,ఓ సుయోధనుడు!114.ఓనాడు కుటుంబాలు ,చాలా పెద్దవి!ఆదాయాలు , పరిమితం,చాలా చిన్నవి!అయినా కష్ట సుఖాలు,కలిసి పంచుకున్నారు!సాటివారికి ఎంతగానో,చేయూతనిచ్చారు!నేడు వితరణ కు,తిలోదకాలు ఇచ్చారు!________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.- డా పివిఎల్ సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి