128.దయ దగా అయింది,!కరుణ కాఠిన్యంగా మారింది!ప్రేమ భ్రమగా నిలిచింది !గీర గర్వంగా గెలిచింది!మానిని మానం దైవం కాచింది!119.ఇంటి విశ్వాస దూలం చెద!నిత్య సామగానం ఓ రొద!మనిషి భుజాన అమ్ముల పొద!పొంచి ఉన్నది ఓ పెద్దఆపద !మనిషికున్న ధైర్యమే సంపద!120.మానవత్వం,జీవన సాగర గట్టు!నడపాలి నావ,తీరం చేరేటట్టు!తెరచాప ,సరిదారి చూపెట్టు !తెడ్డు మీద,నీకు ఉండాలి పట్టు!తెలుసుకుంటే గుట్టు ,బతుకు కాదు రట్టు!_________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.- డా. పి.వి. ఎల్. సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి