130.
సాలెపురుగు,
కట్టే చక్కని గూడు!
పాకే విష నాగు,
పడగ విప్పి పట్టే గొడుగు!
ఏనుగు చేసే,
అభిషేకం, లింగం మునుగు!
కన్నప్ప తన,
కన్నులే ఇచ్చాడు కదన్నా!
ఇవి తెలుసుకుంటే,
నీవు ఓ మనిషివన్నా!
131.
కంటి చూపు
కనుమరుగు!
కాలినడక,
కదలక ఆగు!
తీసే ఊపిరి,
చెప్పకనే జోగు!
మరి బతుకు,
ఇక ఏమి బాగు?
ఈ మాత్రం తెలిస్తే,
చాలు రా బాబు!
132.
విర్రవీగకు ,
నీదో వెర్రి బతుకు !
నీటి బుడగ,
క్షణాన చితుకు!
ఎగిరే గాలిపటం,
దారం పుటుక్కున తెగు!
నదిలో నావ,
చటుక్కున మునుగు,
మాయ జీవితం,
హఠాత్తుగా మాయమగు!
_________
రేపు కొనసాగుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి