జీవన సార్ధకత.-డా. పి వి ఎల్ సుబ్బారావు , 94410 58797.
139. 
       చూడు అది ,
         నిజంగా గానుగ ఎద్దే!
     నిర్ణీత దారిలో తిరుగుతూ,  
          పనిచేస్తుంది అంతే!
 
      ఇది నూతిలో ,
       బతుకుతున్న ఓ కప్పే!
      తానున్న చోటే, 
         బతుకుతుంది అంతే!
     నీకున్నది  మిడిసిపాటే ,
      తప్పనిసరిగా భంగపాటే!
140. 
      ఎంతకాలం ,
                ఈ పరుగు అన్నా!
      వివేకంతో నీ అంతట ,
              నీవే ఆగవా అన్నా!
    బతుకంతా పోటీ ,అది,
    ఏమైనా ఊటీయా అన్నా ?
   అనుక్షణం మనశ్శాంతి,
              లూటీయే కదన్నా !
  ఓనాడు వాడే,ఆపేస్తాడు,
           తెలియు మన్నా!
141. 
నీ దారిలో నీవే వేగం దాటి, 
    త్వరణంతో పోతున్నావు! 
ఆగవు పక్క వాళ్ళని, 
         అసలు పట్టించుకోవు !
ఈ దారిలో అలెగ్జాండరూ,   
       పోతూ పడి పోయాడు!
 నీవు పడిపోతూ "ఆసరా",    
          అంటూ అరుస్తావు!
ఎవరు వింటారు ?
 వెళ్లే వాళ్లందరూ నీవాళ్లేగా!
_________
రేపు కొనసాగుతుంది.
కామెంట్‌లు