148.
చిన్నప్పటి నా ప్రతిజ్ఞ,
నేడు ఓ అవజ్ఞ!
భారతదేశము ,
నా మాతృభూమి!
నేనిప్పుడు, బతికేది,
మరో భూమి!
భారతీయులకు ,
నేను సోదరుడను !
ఇప్పుడు నా సోదరులు,
మరో జాతీయులు!
149.
ఆకర్షణ,
దేశం విడిచేటట్టు చేసింది !
అర్థం ,
కదలలేనట్టు కట్టిపడేసింది !
స్వాభిమాన స్వరం,
మూగదైపోయింది!
అన్నీ ఉన్నా ఇక్కడ ,
నాకు వెలితి ఉంది!
వందేమాతరం ,
నా ఉన్నత స్థితి తల్లివేరు!
150.
ఆ మట్టి అమ్మ ,
ఆకాశం నాన్న !
ఆ గాలి పీల్చా,
నీరు తాగా, పంట తిన్నా !
అంతర్మథనాన జన్మించే,
అమృత భావన!
పశ్చాత్తాపాన ,
ప్రాయశ్చిత్త సంభావన!
స్వదేశ పునరాగమనం, చివరికి ఆ మట్టితో సమ్మేళనం!
_________
రేపు ఫలశ్రుతి తో ,
జీవన సార్ధకత,
అనే ఈ ధారావాహిక, ముగుస్తుంది.
జీవన సార్ధకత.;- డా. పివిఎల్ సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి