152.
నీవు దాత,
స్థానంలో ఉన్నావు !
నేతగా గెలిచి,
నిరూపించావు !
బలి- వామనుడు,
గుర్తున్నారా!
దాత- గ్రహీత ,
దృశ్యం మారుతుంది!
వామనుడు త్రివిక్రముడైతే ,
బలి బలి అయ్యాడు!
143.
వాడు పాపం, ఓ దొంగ!
అన్నం కోసం కన్నం వేశాడు!
నీవు దొరలకే గొప్పదొర !
అందం మీద కన్నేసావురా !
వాడి కడుపు నిండింది,
నీ పాపం పండింది!
144.
పిల్లల కోసం అంటూ,
కూడబెడుతున్నావు!
అన్నం పెట్టు, వస్త్రం కట్టు,
ఇంటిలో నిలబెట్టు, చాలు!
వాళ్లు బతకడం ,
తప్పక, నేర్చుకుంటారు!
కూడబెట్టి ఇస్తే మరి,
సోమరులవుతారు!
బతకలేక బతకాల్సివస్తే,
నిన్ను తిట్టుకుంటారు!
_________
రేపు కొనసాగుతుంది.
;
నీవు దాత,
స్థానంలో ఉన్నావు !
నేతగా గెలిచి,
నిరూపించావు !
బలి- వామనుడు,
గుర్తున్నారా!
దాత- గ్రహీత ,
దృశ్యం మారుతుంది!
వామనుడు త్రివిక్రముడైతే ,
బలి బలి అయ్యాడు!
143.
వాడు పాపం, ఓ దొంగ!
అన్నం కోసం కన్నం వేశాడు!
నీవు దొరలకే గొప్పదొర !
అందం మీద కన్నేసావురా !
వాడి కడుపు నిండింది,
నీ పాపం పండింది!
144.
పిల్లల కోసం అంటూ,
కూడబెడుతున్నావు!
అన్నం పెట్టు, వస్త్రం కట్టు,
ఇంటిలో నిలబెట్టు, చాలు!
వాళ్లు బతకడం ,
తప్పక, నేర్చుకుంటారు!
కూడబెట్టి ఇస్తే మరి,
సోమరులవుతారు!
బతకలేక బతకాల్సివస్తే,
నిన్ను తిట్టుకుంటారు!
_________
రేపు కొనసాగుతుంది.
;
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి