79.
కాకికి పిండం వేయవు, సరే!
తినేముద్దలో మెతుకు విరుపు!
లాభమంతా నీ సొంత మనకు!
కొంత పొరుగువాడికి పంచు
మంచి బతుకుపంచె అంచు!
80.
ఆడదానిలో ఆడతనమే
చూడకు !
ఎవరిమాత ఎదురైనా ,
శ్రీమాత అనుకో!
నీ ఆలి కాక ఏ ఆలిని,
చూసినా నీ చెల్లి అనుకో !
యువతి ఎదురు నిలిస్తే ,
నీ కూతురే అనుకో!
బాలిక ఎవరొచ్చినా ,
నీ మనుమరాలనుకో!
81.
దృష్టిని బట్టి,
కనిపిస్తుంది ఈ సృష్టి!
నీకు ఉండాలి,
ఆ రాముడి దృష్టి !
నీవు మానవత్వానికి ,
చేయాలి పుష్టి!
సేవకుని ఎంతో ప్రేమగా,
కౌగిలించుకున్నాడు !
శత్రు సోదరుడికి,
ఆశ్రయమిచ్చి, పట్టం కట్టాడు!
_________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- దా పి వి ఎల్ సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి