115.నా చిన్ని బొజ్జకు,. శ్రీరామరక్ష!ఎంతసేపు,బతుకంతా అదే దీక్ష !ఎవరి మీదనైనా ,ఉందా ఆపేక్ష !ఎంత సేపూ ,నీవు తిరిగేది ఒకటే కక్ష్య!జాగ్రత్త,నీ జీవితానికి తప్పదు పరీక్ష!116.ఓ మనిషి!చీమలు పెట్టిన,పుట్టలో పామై బతకకు !తేనె పట్టులో,ఒక బిందువైతే చాలు!పరాన్న జీవిగా,జీవితం గడపకు !పరులకు పరమాన్నం ,పంచే వాడివి కావాలి!117.ఓ మనిషి !భోగాలకు ,నిత్యం భోక్తవే !జనక్షేమ ,యజ్ఞాన సమిధవై !త్యాగ జీవన,సోమయాజివై నిలవాలి!జీవితమంటే ,స్వయం సమర్పణం!_________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.- డా. పివిఎల్ సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి