127.ఆకలి,అనుక్షణం దహిస్తుంది,!. దప్పిక,దారుణంగా వేధిస్తుంది!మానం,వస్త్రమంటూ అలమటిస్తుంది!వీటిని కొంతైనా,సాటివారికి తీర్చు!మానవత్వం ఉందని,కాస్త నిరూపించు!128.లోకులు మాటల ,ఈటెల విసురుతారు!అకారణంగా ,పరిహసించి, పరవశిస్తారు!నీ గాయాన్ని వెకిలిగా,తరచూ కెలుకుతారు !ఇవి నీవు వారికి ,తిరిగి చేయకున్న!అదే నీ మానవత్వానికి,పరమార్థమన్నా!129.వానపాము ,నాగుపాము కన్న మిన్న !మొద్దు ఎద్దు బతుకు,రైతుకు తోడు కదన్నా!దానికన్నా ,నీవు మేలే కదన్నా!మానవత్వంతో,కాస్త బతుకు అన్నా!పదిమందికి తోడుగా,బతికితేచాలు అన్నా!_________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా. పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి