136.పెద్ద చెరువు జలం ,ఎండదు !పెద్దవాడి పాపం ,పండదు!శిక్షలు,జైళ్ళు,సామాన్యజనానికే!వాయిదాలు,బైయిళ్ళు,, ఓ నిజ వర్గానికే!కలియుగాన బతుకు,సొంత బలం ఉన్నోళ్ళకే!137.ఆమె చేతి కత్తి ,బొండాలు,భలే నరుకుతుంది!అవి అమ్ముకుంటూ,నీతిగా బతుకుతుంది!తనపై చేయివేస్తే మటుకు,ఆ చెయ్యి నరికేస్తుంది!స్వీయ రక్షణలో,న్యాయమూర్తి అవుతుంది!క్రమశిక్షణలో నేరస్తురాలిగా,కోర్టులో లొంగిపోతుంది!138.వాడు బురదలో పుట్టి , బురదలోనే బతుకుతున్నాడు!ఓనాడు, పద్మమై ,వికసించి పరిమళిస్తాడు!నీవు బురద రాసుకొని,బతుకుతున్నావు!నిన్ను అందరూ ,దూరంగానే ఉంచుతారు!బురద ఒక్కటే అయినా,ఫలితాలు భిన్నమే మరి!_________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా. పి వి ఎల్ సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి